హైవేపై ఇనుప సామగ్రి చోరీ

ABN , First Publish Date - 2022-01-22T05:53:43+05:30 IST

సూర్యాపేట- ఖమ్మం 365వ జాతీయ రహదారి ఇనుప సామగ్రి చోరీ కేసును శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతె పోలీసులు ఛేదించారు.

హైవేపై ఇనుప సామగ్రి చోరీ
డీసీఎంలో పట్టుబడిన ఇనుపసామగ్రిని మోతె పోలీ్‌సస్టేషన్‌లో పరిశీలిస్తున్న కోదాడ డీఎస్పీ రఘు, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌

మోతె, జనవరి 21: సూర్యాపేట- ఖమ్మం 365వ జాతీయ రహదారి ఇనుప సామగ్రి చోరీ కేసును శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతె పోలీసులు ఛేదించారు. మోతె పోలీ్‌సస్టేషన్‌లో కోదాడ డీఎస్పీ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హట్యాతండాకు చెందిన బాదావత్‌ నాగరాజు, అనిల్‌కుమార్‌, బాదావత్‌ సుధీర్‌, భాస్కర్‌, బాదావత్‌ నరేష్‌, గుగులోతు సురేష్‌, బాదావత్‌ మహేందర్‌, నరే్‌షతోపాటు మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన బెజవాడ కోటి, యర్రబోయిన మహేష్‌, అనంతుల నరేష్‌, దాసరి వెంకటేశ్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట-ఖమ్మం రోడ్డు వెడల్పు కోసం అండర్‌పా్‌స నిర్మాణాలు చేపడుతున్న కల్వర్టుల కోసం రోడ్డు వెంట వేసిన ఇనుప సామగ్రిని కొన్ని రోజులుగా చోరీ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన అపహరించిన ఇనుస సామగ్రిని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడేనికి చెందిన దానబోయిన నాగేశ్వరరావు, రావుల ప్రకాశ్‌లకు విక్రయించారు. దీంతోపాటు ఇటీవల చోరీ చేసిన రూ. 6లక్షల విలువైన 10 టన్నుల ఇనుప సామగ్రిని నాగేశ్వర్‌రావు, ప్రకాశ్‌లకు విక్రయించి, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపుకుంట్ల వెంకటయ్యపాలెంకు చెందిన తాళ్లూరి గోపి డీసీఎంలో హైదరాబాద్‌ తరలిస్తున్నారు. ఖమ్మం నుంచి వస్తున్న డీసీఎంను మోతె పోలీ్‌సస్టేషన్‌ ఎదుట వాహన తనిఖీల్లో భాగంగా భాగంగా ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, మునగాల సీఐ ఆంజనేయులు పట్టుకున్నారు. పట్టుబడిన డీసీఎంతోపాటు అందులో ఉన్న నిందితులను అరెస్ట్‌ చేసి, ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పాత ఇనుము సామగ్రి వ్యాపారులు, డీసీఎం డ్రైవర్‌తోపాటు చోరీకి పాల్పడిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రఘు వివరించారు. 

Updated Date - 2022-01-22T05:53:43+05:30 IST