Abn logo
Jun 14 2021 @ 01:02AM

బల్ధియాలో అక్రమాలు....

- అడ్డూ...అదుపు లేకుండా దోపిడి

- లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

- నాలుగు నెలల్లో రెండు పర్యాయాలు ఏసీబీ దాడులు

జగిత్యాల, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల బల్దియాల్లో అక్రమా లు...అవినీతి రాజ్యమేలుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించ డం వల్ల సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా తయారయింది. నా లుగు నెలల్లో రెండు పర్యాయాలు అవినీతి నిరోదక శాఖ అధికారులు జ గిత్యాల మున్సిపల్‌పై దాడులు జరపడం పరిస్థితికి అద్దం పడుతోంది. మున్సిపల్‌లోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగం, రెవెన్యూ విభాగాలు అవినీతి, అక్రమాలకు అడ్డాలుగా మారాయి. మున్సిపల్‌ పాలకవర్గం, కమిషనర్‌, ఇ తర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పకడ్బందిగా దృష్టి సారించక పోవడంతో అవినీతి, అక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

నాడు టౌన్‌ ప్లానింగ్‌....నేడు రెవెన్యూ విభాగం

జగిత్యాల మున్సిపల్‌లో ప్రధానంగా టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ విభాగా లకు చెందిన పలువురు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అవినీతి, అక్ర మాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగుల అవినీతి ఆగడాలను భరించలేని జనం కుదేలవుతున్నారు. మరికొందరు అవినీతి నిరోధక శాఖ అధికారు లను ఆశ్రయిస్తున్నారు. మున్సిపల్‌లో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వ డానికి డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఓ ప్రైవేటు వైద్యుడు ఇచ్చిన ఫి ర్యాదు మేరకు ఫిబ్రవరి 9న ఏసీబీ అధికారులు జగిత్యాల బల్దియాపై దా డులు జరిపారు. జగిత్యాల మున్సిపల్‌లో సోదాలు నిర్వహించి ఇరువురు టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగులు, ఒక లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. పకడ్బంది పథకం ప్రకారం బాధిత ప్రైవేటు వైద్యుడు రా మయ్య రూ. 95 వేల నగదును మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఔట్‌ సోర్సిం గ్‌ ఉద్యోగి కొండేటి రాముకు అందించగా పట్టుకున్నారు. ఈఘటనలో బా ధ్యులయిన రాముతో పాటు లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ గాలసు నాగరాజు, టౌన్‌ ప్లానింగ్‌ సిటి ప్లానర్‌ పిట్టల బాలనందస్వామిలను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తాజాగా మున్సిపల్‌లోని రెవెన్యూ విభాగంలోని ఉద్యోగుల అ వినీతి, అక్రమాల ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మ్యుటేషన్‌ సందర్భంగా అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయ న్న అ నుమానాలతో మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌తో పాటు మేనేజ ర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, రెవెన్యూ విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌ అనూప్‌, బిల్‌ కలెక్టర్‌ అనిల్‌లను విచారించారు. మ్యుటేషన్‌ సందర్భంగా వసూలు చేసి న రుసుమును ఆన్‌లైన్‌ విధానంలో తక్కువగా నమోదు చేసి, ఆఫ్‌లైన్‌ లో రశీదు బుక్కుల్లో ఎక్కువగా నమోదు చేస్తున్నట్లుగా గుర్తించారు. 

విచ్చలవిడిగా అక్రమాలు...

మున్సిపల్‌లో భవన నిర్మాణ అనుమతులకు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మున్సిపల్‌లో ఇంటి అనుమతులు, మ్యుటేషన్‌ ప నుల్లో పారదర్శకతకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తోంది. జగిత్యాల మున్సిపల్‌లో మాత్రం ఆఫ్‌లైన్‌లో పలు పనులు చేస్తూ అక్ర మాలు, అవినీతికి పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వని వ్యక్తుల ఫైళ్లను  ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. డబ్బుల వసూళ్లకు అధికారు లు నేరుగా కొంత మంది మద్యవర్తులను, కింది స్థాయి సిబ్బందిని ఎం చుకొని పనులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జగిత్యాల మున్సిపల్‌లో చేపట్టిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలోనూ పెద్దఎత్తున అ వినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్‌లో పలు అభివృద్ధి పనుల టెండర్ల సందర్భంగా అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నట్లు తె లుస్తోంది. పారిశుధ్య వాహనాల కొనుగోలు, డీజీల్‌ వినియోగంలోనూ సి బ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఇంటి పన్ను, న ల్లా పన్నుల పేరిట వసూళ్లు చేసిన సొమ్మును సైతం పక్కదారి పట్టిస్తు న్నారన్న విమర్శలున్నాయి. హరిత దళాల ఏర్పాటులో జరిగిన నియామ కంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు విమర్శలున్నాయి. దీని కి తోడు కొందరు ప్రజాప్రతినిధులు సైతం విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులున్నాయి. 

లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ....

జగిత్యాల మున్సిపల్‌లో అడుగడుగున అవినీతి, అక్రమాలు చోటుచేసు కుంటున్నప్పటికీ ఉన్నతాధికారులు పకడ్భందీ చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం కారణంగా కింది స్థాయి ఉద్యో గులు, అధికారులు, సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా తయార యింది. ఫలితంగా ప్రతినిత్యం బల్ధియాకు వచ్చే సాధారణ జనం ప నులు పూర్తి చేసుకోవడానికి నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అ ధికారులు బల్ధియాను సందర్శించిన సమయంలో ఆయా విభాగాల్లో ప్ర భుత్వం నిర్ధేశించిన టార్గెట్లు పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు. ఇతర వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. అధికారుల, ఉద్యోగులు, సి బ్బంది పనితీరు, అక్రమాలు, అవినీతి తదితర అంశాలపై నిఘా కరు వైంది. దీంతో మున్సిపల్‌లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఇ ప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి బల్ధియా లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను తొలగించాలని ప్రజలు కోరు తున్నారు.

పకడ్భంది చర్యలు తీసుకుంటాము

- మారుతి ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌, జగిత్యాల

మున్సిపల్‌లో అవినీతి, అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రయ త్నాలు చేస్తున్నాము. కొందరు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురిచేస్తోంది. పకడ్భందిగా దృష్టి సారించి అవినీతి, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటాము.