ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో అక్రమాలు

ABN , First Publish Date - 2020-06-01T10:06:01+05:30 IST

ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే సీబీఐచే విచారణ జరిపించాలని నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు జె. లక్ష్మీనరసింహ డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో అక్రమాలు

సీబీఐ విచారణ జరిపించాలి

నంద్యాల డీసీసీ జె. లక్ష్మీనరసింహ


కర్నూలు (అర్బన్‌), మే 31: ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే సీబీఐచే విచారణ జరిపించాలని నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు  జె. లక్ష్మీనరసింహ డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జీవో సవరణలకు కృషి చేసిన లక్ష్మీనరసింహ, శేషఫణి, డాక్డర్‌ వేణులను బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు, బీజీ జనసభ నాయకులు సన్మానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో పేద విద్యార్థుల అడ్మిషన్లను అడ్డుకునే  జీవో నెంబర్‌ 56, 43, 89లను సవరిస్తూ 57, 58 జీవోలు ఇచ్చినందుకు  ముఖ్యమంత్రికి బీసీ సమాఖ్య తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 

 

ప్రైవేట్‌ కళాశాలల్లో సరైన సిబ్బంది లేకుండా, ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీల సమయంలో మా త్రమే పేమెంట్‌ డాక్టర్లను, అద్దె రోగులను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. 

Updated Date - 2020-06-01T10:06:01+05:30 IST