మంచిర్యాల జిల్లాలో చేపల చెరువుల కేటాయింపులో అక్రమాలు

ABN , First Publish Date - 2021-03-03T02:40:30+05:30 IST

చేపల చెరువుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.

మంచిర్యాల జిల్లాలో చేపల చెరువుల కేటాయింపులో అక్రమాలు
వివాదానికి కారణమైన కారెంగుల చెరువు

- నిబంధనలకు విరుద్ధంగా సొసైటీల ఏర్పాటు

- ఉపాధికి దూరమవుతున్న అర్హులు

-విమర్శలకు తావిస్తున్న మత్స్యశాఖ అధికారుల వైఖరి

మంచిర్యాల, మార్చి 2(ఆంధ్రజ్యోతి): చేపల చెరువుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా సొసైటీలు ఏర్పాటు చేయడమే గాకుండా అనర్హుల కు సభ్యత్వం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చెరువుల కేటా యింపుల్లో అర్హులను కాదని మత్స్యశాఖ అధికారులు డబ్బు, పలుకుబడికే పెద్దపీట వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల వైఖరి కార ణంగా అనర్హులకు చెరువులు దక్యాయి. దీంతో అర్హులకు ఉపాధిలేకుండా పోయింది.

జిల్లాలో 113 చెరువులు..

మంచిర్యాల జిల్లాలో మత్స్యశాఖకు చెందిన 113 చెరువులు ఉన్నాయి. వీటిలో 92 రిజిష్టర్డ్‌ సొసైటీల ద్వారా చేపల పెంపకం చేపడుతున్నారు. ఆయా సొసైటీలలో మొత్తం 5,885 మంది సభ్యులు ఉన్నారు. వారి ద్వారానే చేపల విక్రయాలు జరపాల్సి ఉంది. 2020-22 సంవత్సరాలకు గాను మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా చేపల పెంపకం చెరువులు,  రిజర్వాయర్లలో సమీకృత మత్స్య అభివృద్ధి, కోల్డ్‌ స్టోరేజీ, పెన్‌ కల్చర్‌, పంజరంలో చేపల పెంపకం, ఆక్వా కల్చర్‌, అలంకరణ చేపల ఉత్పత్తి తోపాటు మత్స్యకారులకు మార్కెటింగ్‌ సదు పాయాల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

చేపల పెంపకం చేపట్టేందుకు..

మత్స్యశాఖ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రధానంగా బెస్త, ముదిరాజ్‌ కులస్థులకు మాత్రమే సొసైటీలలో సభ్యత్వం కల్పించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే నోటిఫైడ్‌ ఏరియాల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీలకు సభ్యత్వం ఇచ్చిన తరువాతనే ఇతర కులస్థులకు అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతంలోనైనా సొసైటీకి సరిపడా అర్హులైన కులస్థులు అందుబాటులో లేకుంటనే ఇతరులను చేర్చుకోవలసి ఉంటుంది. అయితే మైదాన ప్రాంతాల్లోనూ బెస్త, ముదిరాజ్‌ కుటుంబాలతోపాటు ఇతర కులస్థులకు సైతం సొసైటీలలో సభ్యత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సొసైటీ ఏర్పాటుకు సరిపడా బెస్త, ముదిరాజ్‌ కులస్థులు అందుబాటులో లేని పక్షంలో మాత్రమే ఇతర కులస్థులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. డ బ్బు, పలుకుబడి కారణంగా నిబంధనలను తోసిరాజని ఇష్టారీతిన సభ్య త్వం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక మత్స్యకార సంఘం లో సభ్యత్వం ఉన్న వ్యక్తికి మరో సొసైటీలో మెంబర్‌షిప్‌ ఉండకూడదు. అయినప్పటికీ జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేట మత్సకార సంఘంలో సభ్యత్వం ఉన్న ఓ వ్యక్తికి జైపూర్‌ మండలం మిట్టపల్లి గ్రామంలోని మరో సొసైటీలో కూడా సభ్యత్వం ఇవ్వడం గమనార్హం. అధి కారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నిజమైన అర్హులు జీవనోపాధికి దూరం అవుతుండగా, అనర్హులు సొసైటీ సభ్యులుగా చలామణి అవుతున్నారు.  

కారెంగుల చెరువులో..

జిల్లాలో భీమిని మండలం చిన్న తిమ్మాపూర్‌లోని కారెంగుల చెరువులో సమీపంలోని చిన్న గుడిపేట, పెద్ద గుడిపేటకు చెందిన ముదిరాజ్‌ కు టుంబాలు ఆరేళ్లుగా చేపల పెంపకం చేపడుతున్నారు. రెండు గ్రామాలకు చెందిన దాదాపు 200 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అంతకు ముందు చిన్న తిమ్మాపూర్‌ అప్పటి సాలిగాం పంచాయతీ పరిధిలో అమ్లేట్‌ గ్రామంగా ఉండేది. మండలాలు, గ్రామ పంచాయతీల విభజన అనంతరం సాలిగాం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండల పరిధిలోకి వెళ్లిపోగా, చిన్న తిమ్మాపూర్‌ ప్రత్యేక జీపీగా అవతరించింది. ముదిరాజ్‌ కుటుంబాలు ఆధారపడ్డ కారెంగుల చెరువు చిన్న తిమ్మాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోకి వెళ్లింది. చిన్న తిమ్మాపూర్‌ గ్రామ పంచాయతీలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు లేకపోవడంతో చిన్న గుడిపేట, పెద్ద గుడిపేటకు చెందిన మత్సకారులు 2019-20 సంవత్సరానికి గాను కారెంగుల చెరువులో గ్రామ పంచాయతీ తీర్మా నంతో చేపల పెంకం చేపట్టారు. అనంతరం పరిస్థితులు మారి పో యి చిన్న తిమ్మాపూర్‌లోనూ సొసైటీలు ఏర్పాడ్డాయి. అయితే ఈ గ్రామం లోని చెరువుపై ఏళ్లుగా ఆధారపడ్డ ముదిరాజ్‌లకు సమాచారం ఇవ్వ కుండా సొసైటీలు ఏర్పాటయ్యాయి.

బినామీలతో స్కిల్‌ టెస్టులు?

సొసైటీలో సభ్యత్వం పొందేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు లకు చేపలు పట్టడంలో నైపుణ్యంపై పరీక్షలు నిర్వహిస్తారు. చెరువులోకి దిగి చేపలు పట్టడం, వల విసరడం, ఈత కొట్టడం లాంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కొందరు బినామీ వ్యక్తులను స్కిల్‌ టెస్టుల్లో ప్రవేశపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు గ్రామంలో చేపల వృత్తిపై ఆధారపడ్డ వారే లేరు. దీంతో నైపుణ్యం కలిగిన మత్స్యకారులు ఉండే అవకాశమే లేదు. అయినప్పటికీ అక్కడ స్కిల్‌ టెస్టులు నిర్వ హించడం, సొసైటీ ఏర్పాటు కావడం జరిగిపోయాయి. చిన్న గుడిపేటకు కారెంగుల చెరువు సుమారు కిలో మీటరు దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలోని మత్స్యకారులను కాదని 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న బిట్టూరుపల్లికి చెందిన ఎస్సీ, ఎస్టీలను ముదిరాజ్‌ల పేరుతో సొసైటీ ఏర్పాటు చేయడం గమనార్హం. పైగా చేపలు పెంచు తున్న కారెంగుల చెరువును కాదని ఎక్కడో కిలో మీటర్ల దూరంలో ఉన్న రాంపూర్‌ చెరువులో పరీక్షలు నిర్వహించడం గమనార్హం. స్కిల్‌ టెస్టుల సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా అర్హులైన 200 కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయింది. స్థానికంగా పరీక్షలు నిర్వహిస్తే సమాచారం బయటకు పొక్కి చిన్నగుడిపేట, పెద్దగుడిపేట గ్రామాల్లోని మత్స్యకారులు అభ్యంతరం తెలిపే అవకాశం ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా మరోచోట పరీక్షలు నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అక్రమాలు చోటు చేసుకుంటే రద్దు చేస్తాం..

- సత్యనారాయణ, మత్స్యశాఖ ఏడీ

భీమిన మండలం కారెంగుల చెరువుకు సంబంధించి సొసైటీల ఏర్పా టులో అక్రమాలు చోటు చేసుకుంటే వాటి గుర్తింపును రద్దు చేస్తాం. స్కి ల్‌ టెస్టులకు నమోదు చేసుకున్న వ్యక్తులే కాకుండా బయటివారు అనఽధికారికంగా హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు. స్కిల్‌ టెస్టుల సమ యంలో వీడియో రికార్డింగు చేసి, సీడీలు తయారు చేస్తాం. టెస్టుల్లో బయటి వ్యక్తులు పాల్గొని ఉంటే ఆయా సంఘాలపై చర్యలు తీసుకుం టాం. హాజీపూర్‌ మండలం గుడిపేట సొసైటీకి చెందిన వ్యక్తికి జైపూర్‌ మండలంలోనూ సభ్యత్వం ఉన్న విషయమై నోటీసులు జారీ చేశాం. అత డికి గుడిపేటలో ఉన్న సభ్యత్వం రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-03-03T02:40:30+05:30 IST