‘అసంబద్ధ పీఆర్‌సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-01-24T05:51:18+05:30 IST

సంబద్ధమైన పీఆర్‌సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రామసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

‘అసంబద్ధ పీఆర్‌సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి’

ఆదోని(అగ్రికల్చర్‌), జనవరి 23: అసంబద్ధమైన పీఆర్‌సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రామసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏపీటీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం చేకూర్చే విధంగా విడుదల చేసిన పీఆర్‌సీ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అశుతోష్‌మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపి 30 శాతం పీఆర్‌సీ ప్రకటంచాలన్నారు. ఇంటి అద్దె అలవెన్స్‌ తగ్గించడం ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఫిబ్రవరి 7 నుంచి సమ్మెబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు నాగరాజు, రాఘవేంద్ర, నిరంజన్‌బాబు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:51:18+05:30 IST