Advertisement
Advertisement
Abn logo
Advertisement

తక్షణసాయం పంపిణీలో కిరికిరి

నగదు పంపిణీ చేయకపోవడంపై తహసీల్దార్‌తో వాగ్వాదం

తొలుత నగదు రాలేదని బుకాయింపు.. అనంతరం పంపిణీ

నల్లచెరువు, నవంబరు 30: మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు తక్షణసాయం పంపిణీలో రెవెన్యూ అధికారులు తీరు వివాదం అయ్యింది. రెండు రోజులుగా 73 మందికి నిత్యావరాలు పంపిణీ చేశారు. వీటితో పాటు రూ. 2 వేల నగదు పంపిణీ చేయకపోయిన బాధితులతో సంతకాలు చేయించుకున్నారు. దీం తో మంగళవారం బాధితులు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని తహ సీల్దార్‌ జిలానీతో వాగ్వాదానికి దిగారు. దీంతో తహసీల్దార్‌ నగదు రాలేదని తొలు త బుకాయించింది. అనంతరం బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రూ. 2 వేల నగదు పంపిణీ చేయడం జరిగింది.  Advertisement
Advertisement