Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవంగా ఇరుముడుల ఊరేగింపు

నెల్లూరు (సాంస్కృతికం), డిసెంబరు 3 : శివ దీక్ష ముగింపు సందర్భంగా ఇరుముడుల ఊరేగింపు కార్యక్రమం శుక్రవారం నగరంలో వైభవంగా జరిగింది. శ్రీశైలం దేవస్థానం మాజీ ధర్మకర్త, మూలస్థానేశ్వరాలయం మాజీ చైర్మన్‌ ఆల్లూరి గిరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో మూలాపేట శంకరమఠంలో భక్తులు ఇరుముడులు కట్టుకున్నారు. మంగళవాద్యాలతో ఊరేగింపుగా మూలస్థానేశ్వర ఆలయానికి చేరుకుని స్వామికి ఇరుముడి సమర్పించి దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ఈవో వేణుగోపాల్‌ పాల్గొన్నారు. కాగా, కార్తీక మాస శివరాత్రి సందర్భంగా మూలస్థానేశ్వరాలయంలో చిన్న రథంలో శివపార్వతులకు గురువారం రాత్రి ప్రాకారోత్సవం కన్నుల పండువగా జరిగింది. 

Advertisement
Advertisement