భూమి లేకుండా కోచ్‌ ఫ్యాక్టరీ సాధ్యమా?: బీజేపీ

ABN , First Publish Date - 2020-08-15T10:23:26+05:30 IST

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ఆరేళ్ల కిందట చెప్పినా, ఎందుకు ..

భూమి లేకుండా కోచ్‌ ఫ్యాక్టరీ సాధ్యమా?: బీజేపీ

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ఆరేళ్ల కిందట చెప్పినా, ఎందుకు ఇప్పటి వరకు భూసేకరణ జరపలేదో మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


‘‘భూసేకరణ జరగకుండా కోచ్‌ ఫ్యాక్టరీ సాధ్యమేనా? భూమి కేటాయించాలని కేంద్రం మీ ప్రభుత్వాన్ని కోరిన మాట వాస్తవం కాదా? కోచ్‌ ఫ్యాక్టరీకి మీరు దేవాదాయ శాఖ భూమి ఇవ్వడం వల్ల వివాదం తలెత్తడం నిజం కాదా?’’ అని ఆయన ప్రశ్నించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం పట్టించుకోవడం లేదంటూ మంత్రి చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని ప్రేమేందర్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి భూసేకరణ జరిపి రైల్వేశాఖకు ఇవ్వాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-08-15T10:23:26+05:30 IST