May 15 2021 @ 12:53PM

కొరటాలతో అఖిల్ ..?

కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని సినిమా ఉండబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగార్జున ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాడట. ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే ఎలా ఉండబోతుందో అని అభిమానుల్లో కూడా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా అలాగే అల్లు అర్జున్ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్స్ పూర్తవ్వాలంటే కాస్త సమయం పడుతుంది. ఇక అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ కావాల్సి ఉండగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా మరో స్టార్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా ఉండబోతోందని సమాచారం. ఆ తర్వాతే కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ నటించే సినిమా ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో వీరి కాంబోలో సినిమా ఉండని తెలుస్తోంది.