Jun 15 2021 @ 15:08PM

'ఢీ' సీక్వెల్‌లో చిట్టి ఫరియా..?

'జాతి రత్నాలు' సినిమాలో చిట్టిగా నటించిన ఫరియా అబ్ధుల్లాకి 'ఢీ' సీక్వెల్‌లో అవకాశం వచ్చిందని వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతి రత్నాలు' సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్ధుల్లా నటించారు. నవీన్ పొలిశెట్టితో పాటు ఫరియాకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకి టాలీవుడ్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలకి ఈమె చెక్ పెడుతూ, మంచి ప్రాజెక్ట్ అయితే కమిటవుతానని..వచ్చిన ప్రతీ సినిమాను అంగీకరించడంలేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మంచి విష్ణు - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఢీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. చిత్ర బృందం ఫరియాను సంప్రదించగా, ఆమె ఒకే అన్నట్టు సమాచారం. ఈ విషయంలో మేకర్స్ నుంచి స్పష్ఠత రావాల్సి ఉంది.