అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులా: టీడీపీ

ABN , First Publish Date - 2021-10-17T05:54:20+05:30 IST

నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందనీ, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం బాధాకరమని టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి విమర్శించారు.

అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులా: టీడీపీ
పార్టీ నాయకులతో మాట్లాడుతున్న బొజ్జల సుధీర్‌రెడ్డి

శ్రీకాళహస్తి, అక్టోబరు 16: నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందనీ, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం బాధాకరమని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి విమర్శించారు. పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే మధు అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తి వివరాలు, ప్రస్తుత ఆస్తి విలువ ఎంత ఉందో ప్రజలు గమనించాలన్నారు. రెండున్నరేళ్ల కాలంలో రూ.కోట్ల విలువైన కార్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ... టీడీపీ శ్రేణులు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తేవాలనీ, ఇందుకు ప్రతిఒకరూ సోషల్‌ మీడియా ఖాతాను ప్రారంభించాల్సి ఉందన్నారు. ఆర్థిక విధానాల అమలు చేతకాకనే వైసీపీ రాష్ర్టాన్ని అథోగతి పాలుచేస్తోందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయం సాధించడం ఖాయమనీ, నిస్వార్థంగా సేవ చేస్తే మంచి పదవులు లభిస్తాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు దశరథాచారి, రెడ్డివారి గురవారెడ్డి, నాయకులు రావిళ్ల మునిరాజ నాయుడు, రంగినేని చెంచయ్య నాయుడు, షాకీర్‌అలీ, మిన్నల్‌ రవి, పొన్నారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:54:20+05:30 IST