భారత్‌లో... హార్లే డేవిడ్సన్ ప్లాంట్ మూతపడనుందా ?

ABN , First Publish Date - 2020-08-21T00:28:30+05:30 IST

హార్లే డేవిడ్సన్... యువత కోరుకునే మోటార్‌సైకిళ్ళలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. అయితే... తాజా పరిస్థితులు, అమ్మకాలు పడిపోయిన నేపధ్యంలో... ఈ సంస్థ... కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హై-ఎండ్ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ భారతదేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేయాలని, ఈ క్రమంలోనే... హర్యానాలోని బావాల్ వద్ద ఉన్న తమ ప్లాంట్‌ను మూసివేయాలని యోచిస్తున్నట్లుగా వినవస్తోంది.

భారత్‌లో... హార్లే డేవిడ్సన్ ప్లాంట్ మూతపడనుందా ?

బావాల్ : హార్లే డేవిడ్సన్... యువత కోరుకునే మోటార్‌సైకిళ్ళలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. అయితే... తాజా పరిస్థితులు, అమ్మకాలు పడిపోయిన నేపధ్యంలో... ఈ సంస్థ... కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హై-ఎండ్ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ భారతదేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేయాలని, ఈ క్రమంలోనే... హర్యానాలోని బావాల్ వద్ద ఉన్న తమ ప్లాంట్‌ను మూసివేయాలని యోచిస్తున్నట్లుగా వినవస్తోంది. 


అమ్మకాలు భారీగా పడిపోవటంతో పాటు భవిష్యత్తులో వాహనాల డిమాండ్ అస్పష్టంగా కనిపిస్తోన్న నేపధ్యంలో భారత్‌లో తన కార్యాకలాపాల నుండి నిష్క్రమించాలని యోచిస్తున్నట్లుగా వినవస్తోంది. ఈ క్రమంలో... హర్యానాలోని బావాల్ వద్దనున్న తమ ప్లాంట్‌ను మూసివేయాలని యోచిస్తున్నట్లు వినవస్తోంది. మొత్తంమీద... హర్యానాలోని బావాల్ వద్దనున్న హార్లే డేవిడ్సన్ ప్లాంట్‌ను మూసివేసే దిశగా సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.


ఈ ప్లాంట్ కు సంబంధించి ఔట్‌సోర్సింగ్ ఇవ్వటానికి ఏర్పాట్ల కోసం కొన్ని వాహన తయారీ సంస్థలకు ఫీలర్‌లను పంపినట్లు వినవస్తోంది. ఔట్‌సోర్సింగ్ ఒప్పందం చేసుకుని చేతులు దులుపుకునే పనిలో ఉన్నట్లు కూడా వినవస్తోంది. కరోనా కారణంగా అంతర్జాతీయంగానే మార్కెట్ దెబ్బ తినడం, ఆటోమొబైల్ రంగం కుదేలు కావడం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే... ఆటోమొబైల్ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. 


Updated Date - 2020-08-21T00:28:30+05:30 IST