విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటేనా..?

ABN , First Publish Date - 2020-08-13T09:11:29+05:30 IST

ఫ్రంట్‌ ఆఫీసులో ఉన్న కంప్యూటర్‌ నుంచి షార్ట్‌ సర్క్యూట్‌ అయిందని కొందరు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌ నుంచి మంటలు రేగాయని మరికొంతమంది అంటున్నారు. తొలుత పొగ సర్వర్‌ రూమ్‌ నుంచి పైకి లేచిందని

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటేనా..?

ఫ్రంట్‌ ఆఫీసులో ఉన్న కంప్యూటర్‌ నుంచి షార్ట్‌ సర్క్యూట్‌ అయిందని కొందరు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌ నుంచి మంటలు రేగాయని మరికొంతమంది అంటున్నారు. తొలుత పొగ సర్వర్‌ రూమ్‌ నుంచి పైకి లేచిందని పోలీసులు చెబుతున్నారు. అసలు ప్రమాదానికి మూలాలు ఎక్కడున్నాయన్న దానిపై సాంకేతికంగా


విశ్లేషణ సాగుతోంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌, సీఈఐజీ అధికారులు మొత్తం మూడు గంటలు పునఃపరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించి డీవీఆర్‌, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌లో సాంకేతిక విధానంలో విశ్లేషించాక నివేదికను సిద్ధం చేస్తారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటేనని ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. వాస్తవాలు తెలియ డానికి డీవీఆర్‌, హార్డ్‌డిస్క్‌ విశ్లేషణ తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్త వడానికి నాలుగైదు రోజులు పడుతుంది. మరోపక్క రమేష్‌ ఆస్పత్రి ఎండీ రమేష్‌బాబు కోసం ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయి.

Updated Date - 2020-08-13T09:11:29+05:30 IST