క్రాష్‌ డైట్‌ మంచిదేనా?

ABN , First Publish Date - 2020-10-18T21:42:20+05:30 IST

బరువు తగ్గడానికి ఏ డైట్‌ కొత్తగా పరిచయం అయినా... ఫాలో అయిపోయే వాళ్లే ఎక్కువ మంది. ఇదిగో ఇప్పుడు క్రాష్‌ డైట్‌ కాలం నడుస్తోంది. తక్కువ కాలంలోనే ఎక్కువ బరువు తగ్గడానికి సాయం చేసే

క్రాష్‌ డైట్‌ మంచిదేనా?

ఆంధ్రజ్యోతి(18-10-2020)

బరువు తగ్గడానికి ఏ డైట్‌ కొత్తగా పరిచయం అయినా... ఫాలో అయిపోయే వాళ్లే ఎక్కువ మంది. ఇదిగో ఇప్పుడు క్రాష్‌ డైట్‌ కాలం నడుస్తోంది. తక్కువ కాలంలోనే ఎక్కువ బరువు తగ్గడానికి సాయం చేసే ... తక్కువ క్యాలరీల డైట్‌ ఇది. అయితే దీనివల్ల దుష్ఫ్రభావాలు కూడా ఎక్కువే. బరువు తగ్గే క్రమంలో మొదట శరీరంలో నీళ్ల శాతం తగ్గుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. డైట్‌లో భాగంగా కొన్ని రకాల ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే సంపూర్ణ పోషకాలు శరీరానికి చేరవు. పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది. డైట్‌లో భాగంగా వ్యాయామాలు చేయక్కర్లేదు. కానీ వ్యాయామం అనేది శరీరానికి చాలా మేలు చేసే ప్రక్రియ. తిన్నది సరైన పద్దతిలో ఖర్చు చేసేందుకు వ్యాయామాలు అవసరం. కానీ క్రాష్‌ డైట్‌లో వ్యాయామానికి చోటు లేదు. కనుక ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది ఆలోచించాల్సిన విషయమే. క్రాష్‌ డైట్‌ చేయాలనుకుంటే.. వైద్యులను సంప్రదించి.. అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. 


Updated Date - 2020-10-18T21:42:20+05:30 IST