సర్జరీతో ఫలితం ఉంటుందా?

ABN , First Publish Date - 2020-03-10T06:21:34+05:30 IST

పిల్లలు కలగకుండా వేసెక్టమీ సర్జరీ చేయించుకుని పదేళ్లు దాటితే, తిరిగి సర్జరీ చేయించుకున్నా పిల్లలు పుట్టే అవకాశాలు 50 శాతమే...

సర్జరీతో ఫలితం ఉంటుందా?

డాక్టర్‌! నా వయసు 45 ఏళ్లు. ఇరవై ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వేసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఆ తర్వాత మొదటి భార్య చనిపోవడంతో ఇటీవలే రెండవ పెళ్లి చేసుకున్నాను. ఆమె వయసు 32 ఏళ్లు. తను పిల్లలు కావాలని అంటోంది. సర్జరీ చేయించుకుని, తిరిగి పిల్లలను కనగలిగే అవకాశం ఉందా?

- ఓ సోదరుడు, దోర్నాల.


పిల్లలు కలగకుండా వేసెక్టమీ సర్జరీ చేయించుకుని పదేళ్లు దాటితే, తిరిగి సర్జరీ చేయించుకున్నా పిల్లలు పుట్టే అవకాశాలు 50 శాతమే! పైగా మీ భార్య వయసు 32 ఏళ్లు అంటున్నారు కాబట్టి, మొదట సహజసిద్ధంగా పిల్లలను కనే అవకాశాలు ఆమెకు ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. ఆమెలో ఎలాంటి ఇబ్బందులూ లేకపోతే, అప్పుడు మీకు హార్మోన్‌ పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సర్జరీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆమెలో సమస్యలు ఉంటే, మీరు సర్జరీ చేయించుకున్నా ఫలితం ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఐ.వి.ఎఫ్‌ (ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌) ద్వారా పిల్లలను కనవచ్చు.


  • - డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌
  • జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌
  • 8332850090 (కన్సల్టేషన్‌ కోసం)

Updated Date - 2020-03-10T06:21:34+05:30 IST