Jun 3 2021 @ 13:49PM

సొంత గొంతేనా..!

'పుష్ప'లో కీలక పాత్ర పోషించేవారు సొంత గొంతు వినిపించాల్సిందేనని దర్శకుడు సుకుమార్ సూచించినట్టు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈమధ్య ఈయన పాత్రకి యంగ్ హీరో తరుణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఫాహద్ ఫాజిల్ ఇటీవల డబ్బింగ్ సినిమా 'అనుకోని అతిథి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇందులో ఆయన పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. దాంతో ఈ ప్రచారం మొదలైంది. 

అయితే 'పుష్ప' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. కనుక అన్ని భాషలకు ఆయా పాత్రల్లో నటించిన వారే డబ్బింగ్ చెప్పుకోవాలని సుకుమార్ సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఫాహద్ ఫాజిల్ తెలుగుపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. రష్మిక కూడా ఆ మధ్య తెలుగు భాష నేర్చుకునేందుకు కుస్తీ పడింది. రష్మిక, ఫాహద్ ఫాజిల్‌తో పాటు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్న నటీ, నటులు కూడా తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకోనున్నట్టు సమాచారం. కాబట్టి తరుణ్ ఫాజిల్‌కి డబ్బింగ్ చెప్పనున్నాడనే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.