ఇప్పుడు చేసింది తప్పు కాదా: ఓ కళ్యాణ్

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు జరిగి ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసి 'మా' అధ్యక్షుడిగా బాధ్యలను కూడా చేపట్టారు. అయితే ఇదే సమయంలో ఎలాంటి రచ్చ, గొడవలు జరిగాయో కూడా అందరికీ తెలిసిందే. పోలింగ్ రోజు సక్రమంగా ఓటింగ్ జరగలేదని..తప్పుడు ఫలితాలను వెల్లడించారని ప్రకాష్ రాజ్ బృందం వాధించారు. ఈ నేపథ్యంలోనే 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ను పోలింగ్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ అందజేయాలని ప్రకాష్ రాజ్ కోరారు. దాంతో ‘లా’ ప్రకారం ఆయన అడిగింది ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు..అని చెప్పిన కృష్ణమోహన్, ఇప్పుడు ఫుటేజ్‌కి సంబంధించిన వ్యవహారం నా పరిధిలో లేదంటూ, అది ‘మా’ అధ్యక్షుడైన మంచు విష్ణు నిర్ణయమే అంటూ ఆయన మాట మార్చారు.

దీనిపై తాజాగా నటుడు ఓ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా.."మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ సభ్యులకు మరియు ఎన్నికైన సభ్యులందరికీ కంగ్రాట్స్. సద్దుమణిగింది ..సద్దుమణిగింది..అనుకుంటున్నాము. గత కొన్నిరోజులుగా మళ్ళీ ఎలక్షన్స్ కి సంబంధించిన ఫుటేజ్ కోసం ప్రకాష్ రాజ్ మరియు వారి టీమ్ అడగటం, దానికి 'మా' అసోసియేషన్‌కు 10 సార్లు ఎలక్షన్ కండెక్ట్ చేసి అది నా ప్రివిలేజ్..నా గౌరవం అని చెప్పిన కృష్ణమోహన్ చెప్పే సమాధానం నాకు నచ్చలేదు. 

ఓ కంటెస్టెంట్ క్యాండిడేట్..గెలిచిన వ్యక్తి కెమెరా ఫుటేజీ గానీ, ఇంకేదైనా అడిగినప్పుడు నా రోల్ అయిపోయింది..ఎలక్షన్స్ కండెక్ట్ చేయడం వరకే నా రోల్ ..ఆ తర్వాత నా రోల్ లేదు..మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి.. అని చెప్పడం అనేది సరిగ్గా లేదు. కృష్ణమోహన్ గారు మీ రోల్ ఎలా అయిపోతుందనుకుంటున్నారు..! అంటే మీరు చేసే ప్రతీ పని ప్రతీ ఎలక్షన్ కరెక్ట్‌గా కండెక్ట్ చేస్తున్నానని అనుకుంటున్నారా..మీరు మొన్న అన్నయ్య మోహన్ బాబు గారి గురించి ఒక మాట చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిపాను..ఎంతో సవ్యంగా చేశానని. ఆయన ఆధ్వర్యంలో మీరు ఎలక్షన్ పెట్టడం ఏంటండీ ..? అని ఓ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు మీరు బైలాను ఫాలో అయ్యారా..?ముందు నుంచి మీరు తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. గెలిచిన సభ్యులకి లెటర్లు రాశారా..? మీరు ఎలక్షన్ కండెక్ట్ చేసిన రోజు మీతో పాటు బయట మెంబర్స్‌ను ఎందుకు రానిచ్చారు?"..అంటూ పలు విషయాలను ఓ కళ్యాణ్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన మిగతా విషయాలను పై వీడియోలో చూడవచ్చు.  

Advertisement
Advertisement