కర్ణాటక సీఎంని మళ్లీ మార్చేస్తున్నారా?

ABN , First Publish Date - 2021-12-20T03:07:25+05:30 IST

పరిస్థితులు చూస్తే కర్ణాటక ముఖ్యమంత్రిని మళ్లీ మార్చబోతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రే ఈ అనుమానాలు వచ్చేలా సంకేతాలు ఇచ్చారు. ఉన్నట్టుండి ఆయన పదవులు శాశ్వతం కాదు..

కర్ణాటక సీఎంని మళ్లీ మార్చేస్తున్నారా?

బెంగళూరు: పరిస్థితులు చూస్తే కర్ణాటక ముఖ్యమంత్రిని మళ్లీ మార్చబోతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రే ఈ అనుమానాలు వచ్చేలా సంకేతాలు ఇచ్చారు. ఉన్నట్టుండి ఆయన పదవులు శాశ్వతం కాదు, జీవితంలో ఏదీ శాశ్వతం కాదంటూ జీవిత సత్యాలు చెబుతున్నారు. అంతే కాదు, తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తన నిజయోవకర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్‌నేనని ముఖ్యమంత్రిని కాదంటూ వ్యాఖ్యానించడం విశేషం.


‘‘ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ జీవితమే శాశ్వతం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈ పదవులు కూడా శాశ్వతం కాదు. ప్రతి క్షణం ఈ వాస్తవాన్ని నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను హోమంత్రిగా, నీటిపారుదల మంత్రిగా గతంలో పని చేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ మీ అందరికీ నేను బసవరాజ్‌నే’’ అని సీఎం బొమ్మై అన్నారు.


పదవులు శాశ్వతం కాదు, ముఖ్యమంత్రిని కాను బసవరాజ్‌ని అని సీఎం బొమ్మై వ్యాఖ్యానించడం వెనుక ఆయన పదవీచ్యుతులవబోతున్నారనే ప్రచారం జోరుగా సాగబోతోంది. బీజేపీ అధిష్టానం తొందరలోనే కార్ణాటకకు కొత్త ముఖ్యమంత్రిని నియమించనున్నట్లు నెటిజెన్లు చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై కర్ణాటక బీజేపీ స్పందించలేదు.


కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై జూలై 28న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఎష్ యడియూరప్ప రాజీనామా అనంతరం అధిష్టానం సూచన మేరకు బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి బసవరాజ్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. అయితే ఆరు నెలలు కూడా గడవక ముందే సీఎంగా తప్పుకోనున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో తక్కువ కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు కర్ణాకటలో ఇదే పునరావృతం అవబోతుందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే వాస్తవం ఏంటనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2021-12-20T03:07:25+05:30 IST