Abn logo
Mar 9 2021 @ 12:25PM

కీర్తి సురేష్ అనుష్కని ఫాలో అయిందా.. అందుకేనా కెరీర్ డైలమాలో పడిందా..?

కీర్తి సురేష్ తమిళంలో రజనీ మురుగన్ సినిమాతో బాగా పాపులారిటీని తెచ్చుకుంది. అదే ఏడాది టాలీవుడ్‌లో నేను శైలజ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే కీర్తి సురేష్ బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి మహానటి, సినిమాలు చేయగా ఒక్క అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ కాగా మిగతా సినిమాలన్ని మంచి హిట్స్‌ని సాధించాయి. ముఖ్యంగా మహానటి సినిమా కీర్తి సురేష్ సౌత్ మొత్తం విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. చెప్పాలంటే మహానటి సినిమాకి ముందు మహానటి తర్వాత అన్నట్టుగా కీర్తి సురేష్ పాపులారిటీ సాధించింది. దాంతో వరసగా తెలుగు, తమిళంలో సినిమాలు ఒప్పుకుంది. అయితే ఇక్కడే కీర్తి సురేష్ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఫాలో అయిందా అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. అనుష్కకి తన కెరీర్‌లో అరుంధతి సినిమా మైల్ స్టోన్‌గా నిలిచింది. అంతకముందు వరకు అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది లేదు. కాని అరుంధతి సినిమా తర్వాత వచ్చిన క్రేజ్‌తో పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి లాంటి సినిమాలు చేసింది. వీటిలో సైజ్ జీరో కోసం అనుష్క చాలా రిస్క్ చేసి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తనని తాను మార్చుకొని బాగా బొద్దుగా తయారైంది. 

అదే ఆ తర్వాత అనుష్క కెరీర్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేసిందని చెప్పాలి. ఇదే సమయంలో ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన సినిమాలలో గెస్ట్ రోల్ చేసింది. ఇవన్ని అనుష్కకి కొంత మైనస్ అవుతూ రాగా.. రీసెంట్‌గా నిశ్శబ్దం సినిమాలో అనుష్క ఛాలెంజింగ్ రోల్ చేసినా కూడా అది పెద్ద మైనస్ అయింది. కీర్తి సురేష్ కూడా మహానటి తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకొని రాంగ్‌స్టెప్ వేసిందన్న టాక్ తెచ్చుకుంది. బొద్దుగా ఉన్నది కాస్తా లాక్‌డౌన్ సమయంలో సన్నగా తయారైంది. ఈ లుక్ అభిమానులకే కాదు ప్రేక్షకులకు పెద్దగా నచ్చడంలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు కీర్తి సురేష్ కెరీర్ మీద గట్టిగా ప్రభావం చూపుతోందని అంటూన్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  రంగ్ దే సినిమా హిట్ అయితే కీర్తి సురేష్‌కి కాస్త ఊరట లభిస్తుంది. లేదంటే ఇక ఆశలన్నీ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మీదే పెట్టుకోవాల్సి వస్తుంది. 

Advertisement
Advertisement
Advertisement