వృద్ధాప్యాన్ని నియంత్రించడానికి ఇది చేస్తే చాలు..

ABN , First Publish Date - 2020-03-20T19:02:47+05:30 IST

వెన్నతీసిన పాలు తీసుకోవడం ద్వారా అకాల వృద్ధాప్యాన్ని నియంత్రించవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. తక్కువ కొవ్వున్న పాలను తాగేవారు వారి వయసు కంటే నాలుగున్నరేళ్లు

వృద్ధాప్యాన్ని నియంత్రించడానికి ఇది చేస్తే చాలు..

ఆంధ్రజ్యోతి(20-03-2020):


పాలతో వృద్ధాప్యానికి చెక్

వెన్నతీసిన పాలు తీసుకోవడం ద్వారా అకాల వృద్ధాప్యాన్ని నియంత్రించవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. తక్కువ కొవ్వున్న పాలను తాగేవారు వారి వయసు కంటే నాలుగున్నరేళ్లు చిన్నవారిగా కనిపిస్తారని పేర్కొంది. సుమారు ఆరువేల మందిమీద, వారు తీసుకునే ఆహారం, ఎలాంటి పాలు తాగుతారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట  అధ్యయనకారులు పై విషయాన్ని నిర్ధారించారు. క్రోమోజోముల పరిమాణం ఆధారంగా డీఎన్‌ఏ వయసును శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రజలు తీసుకునే పాలల్లో ఒక శాతం కొవ్వు అధికమైనా వారి డీఎన్‌ఏ వయస్సు నాలుగేళ్లకు పైగా పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. 0.3 శాతం కొవ్వు కలిగి ఉన్న పాలను తీసుకునే వారు దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని సర్వే సూచించింది. పాలు తాగడం అనారోగ్యకరం కాదని, కానీ మీరు ఎలాంటి పాలు తాగుతున్నారనే దానిపై అవగాహన ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు. అయితే వెన్నతీసిన పాలు డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడతాయనేందుకు పరిశోధకులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం. 

Updated Date - 2020-03-20T19:02:47+05:30 IST