Jun 24 2021 @ 11:25AM

నందిత శ్వేతా బాలీవుడ్‌లో ట్రై చేస్తోందా..?

సౌత్ హీరోయిన్ నందిత శ్వేతా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమె తెలుగులో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయినా, ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కలేదు. 'బ్లఫ్ మాస్టర్' - 'అభినేత్రి-2' - 'కల్కి' - 'కపటదారి' సినిమాలలో నటించింది. కానీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇక్కడే కాదు తమిళం, కన్నడ భాషల్లో నటించిన మొదటి సినిమాలు సూపర్ హిట్ అయినా, ఆ తర్వాత మాత్రం ఆశించిన విజయాలు దక్కలేదు. కెరీర్ ప్రారంభం నుంచి నందిత గ్లామర్ రోల్స్ కాస్త దూరంగా ఉంటోంది. వరుసగా అవకాశాలు అందుకోకపోవడానికి ఇది కూడా ఓ కారణం అనే మాట వినిపిస్తోంది. సౌత్‌లో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్‌లో ట్రై చేస్తోందట. ప్రముఖ నిర్మాణ సంస్థలలో వెబ్ సిరీస్ లేదా సీరియల్స్ అవకాశాల కోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అక్కడైనా అమ్మడి ఫేట్ మారుతుందేమో చూడాలి.