మన డేటా సురక్షితమేనా?

ABN , First Publish Date - 2020-05-09T05:30:00+05:30 IST

చవకగా వస్తుందని చైనా ఫోన్‌ కొంటున్నారా? టిక్‌టాక్‌లో రోజుకో వీడియో పోస్టు చేస్తున్నారా? ఫేస్‌బుక్‌లో మీ ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

మన డేటా సురక్షితమేనా?

చవకగా వస్తుందని చైనా ఫోన్‌ కొంటున్నారా? టిక్‌టాక్‌లో రోజుకో వీడియో పోస్టు చేస్తున్నారా? ఫేస్‌బుక్‌లో మీ ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త! మీ వ్యక్తిగత డేటా చైనా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఆధారాలతో నిరూపితమైంది. హువాయి సంస్థ నిఘా కార్యాకలాపాలకు పాల్పడుతోందని అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే కదా! మరి ఇలాంటి పరిస్థితుల్లో చైనా సాంకేతిక ఉత్పత్తులను కొనడం సరైన పనేనా? 


కరోనాకు కారణం చైనా దేశమే అన్న అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. దాదాపు పదేళ్ల పాటు చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 17 టెలికామ్‌ సంస్థల ద్వారా వినియోగదారుల సంభాషణలు, ఇతర సమాచారాన్ని తెలుసుకున్నట్టు కొంతకాలం క్రితం వెల్లడైంది. 


షామీ ఫోన్‌ యూజర్లకి షాక్‌!

చవకగా లభిస్తున్నాయని చాలామంది షామీ, ఒన్‌ప్లస్‌, ఒప్పో, వివో వంటి వివిధ చైనా ఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. అయితే షామీ ఫోన్లలో వినియోగదారుల ప్రమేయం లేకుండా వారి వ్యక్తిగత సమాచారం మొత్తం చైనాకి తరలించబడుతోందని గాబి సిర్లిగ్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ఆధారాలతో సహా నిరూపించాడు. షామీ ఫోన్‌వినియోగదారుడు ఇంటర్నెట్‌లో ఎలాంటి వెబ్‌ సైట్లు ఓపెన్‌ చేస్తున్నాడు, అతను ఫోన్‌లో ఎలాంటి అప్లికేషన్లు వాడుతున్నాడు వంటి మొత్తం సమాచారం స్ర్కీన్‌షాట్‌ రూపంలో ఆలీబాబా సంస్థకు చెందిన సర్వర్లకి రహస్యంగా చేరుతోంది. దీని గురించి షామీ సంస్థ స్పందిస్తూ యూజర్ల ప్రవర్తనా సరళిని అధ్యయనం చేయడం కోసం కేవలం కొద్ది మొత్తంలో మాత్రమే సమాచారాన్ని సేకరిస్తామని పేర్కొని చేతులు దులుపుకుంది. 2014లో భారత వైమానికదళం ఈ చైనా ఫోన్లని వాడొద్దని తమ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


టిక్‌టాక్‌ ద్వారా..

టిక్‌టాక్‌ సంస్థ కూడా చైనాలో ఉండే ఓ ఎనలటిక్స్‌ సంస్థకి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చేరవేస్తున్నట్లుగా ఆధారాలు లభించాయి. దాని గురించి భారత పార్లమెంట్‌లో చర్చ కూడా జరిగింది. ఇప్పటికీ ఎనలటిక్స్‌ పేరు చెప్పి టిక్‌టాక్‌తో పాటు అనేక అప్లికేషన్లు భారతీయ వినియోగదారుల కీలకమైన సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయి. 


మన ఫొటోలే సేకరించి..

ఫేస్‌బుక్‌లో ఈమధ్య ఊ్చఛిజ్చ్టి, ఏజీూౌఠీ వంటి కొన్ని అప్లికేషన్ల ప్రకటనలు కన్పిస్తున్నాయి. వీటి గురించి ‘ఆంధ్రజ్యోతి’ పరిశోధన చేసినపుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి చైనా అప్లికేషన్లు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసుకునే భారతీయ మహిళల ఫోటోలను వారి అనుమతి లేకుండా డౌన్‌లోడ్‌ చేసుకొని, వాటితో వ్యాపార ప్రకటనలు రూపొందిస్తుంటాయి. ఆ ఫొటోల్లో కనిపించే మాదిరి మహిళలతో వీడియో ఛాటింగ్‌ చేయాలంటే తమ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యువతను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ ప్రలోభాలకు లోబడి ఎవరైనా సంబంధిత అప్లికేషన్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఊబిలోకి వెళ్లినట్టే. డబ్బులు గుంజడంతోపాటు, వినియోగదారుల డేటా కూడా తస్కరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.


భారతీయ యువతే లక్ష్యం

భారతీయ యువతను లక్ష్యంగా చేసుకుని చైనా కంపెనీలు యాప్స్‌ తయారుచేస్తున్నాయి. టిక్‌టాక్‌ దీనికి పెద్ద ఉదాహరణ. అధిక శాతం యువత తగిన గుర్తింపు లభిస్తోందని, కెరీర్‌ మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి అప్లికేషన్ల మీద సమయం గడుపడంతో అనేక రకాలుగా నష్టపోతున్నారు. మరోవైపు చైనా ఫోన్లు, ఇతర హార్డ్‌వేర్‌ పరికరాలు అతి ముఖ్యమైన భారతీయుల డేటా మొత్తం చైనాకు చేరవేస్తున్నాయి. వినియోగదారులు అప్రమత్తంగా లేకపోతే డేటా పోవడంతో పాటు విలువైన సమయం కూడా నష్టపోతారు.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-05-09T05:30:00+05:30 IST