Abn logo
Sep 19 2021 @ 02:52AM

కాబోయే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహులేనా!?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: కాంగ్రెస్‌ పార్టీకి కాబోయే అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయేననే సంకేతాలు వెలువడుతున్నాయి.  రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని చేయాలని శనివారం జరిగిన ఆ పార్టీ సోషల్‌ మిడియా విభాగం జాతీయ కార్యవర్గ సమావేశం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆయన నాయకత్వంలో పార్టీకి కొత్త శక్తి వస్తుందని పేర్కొంది. ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ, పార్టీ ఎస్టీ,ఎస్సీ విభాగం జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇటువంటి తీర్మానాలనే చేశాయి. రాహుల్‌ గాంధీ సమక్షంలోనే  సోషల్‌ మిడియా ఈ తీర్మానం చేయడం విశేషం. పార్టీలోని అన్ని విభాగాలు ఈ విధమైన తీర్మానాలు చేయడం ద్వారా రాహుల్‌నే అధ్యక్షుడిని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.