Apr 11 2021 @ 11:30AM

మహేష్‌కీ తప్పడం లేదు..!

కరోనా సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ మేకర్స్ అండ్ హీరోస్ మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదా.. అవునన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్‌లో తెరకెక్కి రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలని పోస్ట్‌పోన్ చేశారు. బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవన్షి సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మేకర్స్ రీసెంట్‌గా ప్రకటించగా.. తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన తలైవి సినిమా కూడా పోస్ట్‌పోన్ అయింది. ఈ రెండు సినిమాలను మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది త్వరలో అధికారకంగా వెల్లడిస్తామని ప్రకటించారు. ఇక రానా దగ్గుబాటి నటించిన నటించిన అరణ్య సినిమా కూడా తెలుగు, తమిళంలో మాత్రమే రిలీజ్ అయింది గానీ హిందీ వెర్షన్ ఆగిపోయింది. 

ఇక కారణం కరోనా సెకండ్ వే వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి రావడం కష్టమన్న ఆలోచనతోనే ఈ ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన లవ్ స్టొరి సినిమాని అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు వెల్లడించారు శేఖర్ కమ్ముల బృందం. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట కూడా షూటింగ్ పోస్ట్ అయినట్టు తాజా సమాచారం. కరోనా సెకండ్ విస్తృతి ఎక్కువవుతుండటంతో విదేశాలలో అనుకున్న సెకండ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. అయితే హైదరాబాద్‌లో వచ్చే వారం నుంచి 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట బృందం తాజాగా ఈ షెడ్యూల్‌ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.