Jun 24 2021 @ 09:23AM

మెగాస్టార్ సరసన సోనాక్షి..?

మెగాస్టార్ చిరంజీవి సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించబోతోందా..అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోందట. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ 'ఆచార్య'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. తిరిగి త్వరలోనే  షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇది పూర్తయ్యాక తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ 'లూసిఫర్‌'ను సెట్స్ మీదకి తీసుకురానున్నారు చిరంజీవి. వీటి తర్వాత బాబీ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ కలసి నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించారట. ఎప్పటి నుంచో సౌత్ ఎంట్రీ కోసం వేచి చూస్తున్న ఆమె, ఇందులో నటించేందుకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాలి.