సీఎం జిల్లాకు రాకుండా నిద్రపోతున్నారా?

ABN , First Publish Date - 2021-12-02T06:28:02+05:30 IST

జిల్లాలో పప్పుశనగ, వరి, కంది, మొక్కజొన్న పంటలు భారీ వర్షాలకు దెబ్బతిని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లాలో పర్యటించకుండా నిద్రపోతున్నారా? అని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రశ్నించారు.

సీఎం జిల్లాకు రాకుండా నిద్రపోతున్నారా?
రొద్దం వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నాయకులు

వందశాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి 

మాజీ ఎమ్మెల్యే  బీకే పార్థసారథి

2 గంటలపాటు  టీడీపీ రాస్తారోకో 

రొద్దం, డిసెంబరు 1: జిల్లాలో పప్పుశనగ, వరి, కంది, మొక్కజొన్న పంటలు భారీ వర్షాలకు దెబ్బతిని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లాలో పర్యటించకుండా నిద్రపోతున్నారా? అని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రశ్నించారు. బుధవారం వ్యవసాయ కార్యాలయం ఎదుట పెనుకొండ, పావగడ రహదారిపై 2గంటలపాటు బీకే ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. భారీ వర్షాలతో వ్యవసాయ పంటలు అతలాకుతలం అయ్యాయని వైసీ పీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మంత్రి అయినా జిల్లాలో పర్యటించి పంట పొలాలు పరిశీలించి, నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పెనుకొండ నియో జకవర్గంలో పరిగి, పెనుకొం డ, రొ ద్దం మండలాల్లో అత్యధికంగా పప్పుశనగ సాగుచేసి రైతులు నష్టపోయారన్నారు. మంత్రి శంకరనారాయణ పెద్దగువ్వలపల్లికి వచ్చి పంట నష్టపరిహారంపై చేతులెత్తేశారని ఘాటుగా విమర్శించారు. పప్పుశనగ రైతులను వందశాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. కంది, పప్పు శనగకు ఎకరాకు రూ.8 వేలు, మొక్కజొన్నకు రూ.15 వేలు, వేరుశనగ, వరిపంటలకు రూ.25 వేలు చొప్పున నష్టపరిహా రం అందించాలని డిమాండ్‌ చేశారు. పెనుకొండ వ్యవ సాయశాఖ ఏడీ స్వయంప్రభ, ఏఓ నివేదిత ధర్నావద్దకు  వచ్చి పంట నష్టపరిహారం నివేదికలు ప్రభుత్వానికి అంద జేశామని విత్తనాలు 80శాతం సబ్సిడీతో నాలుగు రోజుల్లో అందిస్తామని హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు ధర్నా విరమించారు. బీకే, నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వ్యవసాయ అధికారులకు అందించారు.  కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, అధికారి ప్రతినిధి నరసింహులు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి జీవీపీ నాయుడు, మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, కన్వీనర్‌ చంద్రమౌళి, మాధవ నాయుడు, రామకృష్ణప్ప, తెలుగు మహిళలు లీలావతి, తు లసి, టైలర్‌ ఆంజనేయులు, నరహరి, జిల్లా గ్రంథాలయ మా జీ డైరెక్టర్‌ కలిపి కృష్ణప్ప, తురకలాపట్నం నాగేంద్ర, అశ్వత్థనారాయణ, హిందూపురం పార్లమెంట్‌ టీఎనఎ్‌స ఎఫ్‌ ఉపాధ్యక్షులు హరి, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి పవన కుమార్‌, ము రళి, జానకి రాం, మాజీ సర్పంచులు నాగ భూషణం, మనోహర్‌ పప్పుశనగ రైతులు పాల్గొన్నారు. 



మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు 

రాయదుర్గంరూరల్‌, డిసెంబరు 1: అధిక వర్షాలకు నష్టపోయిన ప్రతి మిరప రైతును ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఆవులదట్ల గ్రామంలో రైతులు సింగయ్యచౌదరి, ఆంజనే యులు, మల్లికార్జున సాగు చేసిన మిరప పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో ఈ ఏడాది సాగు చేసిన మిరప పంట అధిక వర్షంతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ఒక ఎకరా మిరప పంట సాగు చేసేందుకు రూ.1.25 లక్షలు నుంచి రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి ఖర్చు అయ్యిందన్నారు. పంట చివరి దశలో తెగుళ్లు రావడంతో పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. కనీసం కూలీలకు సరిపడా ఆదా యం కూడా మిరప పంటనుంచి రాని పరిస్థితి ఉంద న్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోకపో తే మరలా రైతు పంటలు పెట్టే పరిస్థితి ఉండదన్నారు.  మిరప పంట సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 75 వేలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలన్నారు.   కార్యక్రమంలో మండల కన్వీనర్‌ హనుమంతు, సర్పంచ లు వన్నూరుస్వామి, నాయకులు ప్రసాద్‌, సింగయ్య చౌదరి, ఆంజనేయులు, హనుమంతు, సోమశేఖర్‌, వన్నూ రప్ప, తదితరులు పాల్గొన్నారు. 



జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్‌

రామగిరి, డిసెంబరు 1: వరుస కరువులతో అల్లాడుతున్న జిల్లా రైతులు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా కోల్పోయి, తీవ్రంగా నష్టపోయారనీ, వారిని ఆదుకునేందుకు అనంతకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. వర్షాలకు మండలంలో సాగుచేసిన పప్పుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం మండలంలోని పీఆర్‌కొట్టాల, కొత్తగేరి, దుబ్బార్లపల్లి పరిధిలో 600 ఎకరాల రేగడి భూముల్లో దెబ్బతిన్న పప్పుశనగ పంటను పరిశీలించారు. రైతులతో నష్టాన్ని అడిగి, తెలుసుకున్నారు. పప్పుశనగ పంట కోల్పోయిన రైతులకు విత్తన సబ్సిడీ 80 శాతం ఇస్తున్నారనీ, అదికూడా తక్కువగా ఇస్తున్నారని రైతులు.. పరిటాల సునీత దృష్టికి తెచ్చారు. ఆమె ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో మాట్లాడారు. రైతులు తిరిగి పంటలు వేసేందుకు వీలుగా వందశాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని కోరారు. పంట నష్టంపై అధికారులు పర్యటించి, వివరాలు తెలుసుకోవడం లేదన్నారు. చాలాచోట్ల డ్రిప్‌, స్ర్పింక్లర్లు, మెటార్లు దెబ్బతిన్నాయనీ, కొన్నిచోట్ల కొట్టుకుపోయాయనీ, వీటిని రైతులకు వందశాతం సబ్సిడీతో ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి ఉన్నతస్థాయిలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట టీడీపీ నాయకులు దుబ్బార్లపల్లి సుధాకర్‌, ఎస్సీ సెల్‌ నేత పోతన్న, ఎంపీటీసీ శ్రీనివాసులు, లింగా శ్రీధర్‌నాయుడు, రమణ, వెంకటేశ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T06:28:02+05:30 IST