Jul 28 2021 @ 04:27AM

కాంబినేషన్‌ కుదిరేనా?

ఇటీవ లే కార్తీ సరసన ‘సుల్తాన్‌’ చిత్రంతో కథానాయికగా తమిళ ఎంట్రీ ఇచ్చారు రష్మికా మందన్న. త్వరలోనే ఆమె మరో సారి తమిళ హీరోతో జట్టుకట్టబోతున్నారని కోలీవుడ్‌ టాక్‌. హీరో శివకార్తికేయన్‌, ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్నను అనుకుంటున్నారని టాక్‌. రెండు భాషల్లోనూ రష్మిక సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతారని చిత్రబృందం భావిస్తోందనీ, అందుకు రష్మిక కూడా ఆసక్తి చూపారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.