నల్లగొండకు దక్కాల్సిన నీళ్లు పాలమూరుకా?

ABN , First Publish Date - 2022-08-29T10:13:28+05:30 IST

నల్లగొండ, ఆగస్టు 28: ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్లగొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు కేటాయిస్తూ ఇచ్చి

నల్లగొండకు దక్కాల్సిన నీళ్లు పాలమూరుకా?

246 జీవో రద్దు చేయకుంటే దీక్ష: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండ, ఆగస్టు 28: ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్లగొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు కేటాయిస్తూ  ఇచ్చిన జీవో 246ను రద్దు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజల మధ్య కొట్లాట పెట్టేలా సీఎం కేసీఆర్‌ చర్యలున్నాయని ఆరోపించారు. జీవో 246ను రద్దుచేయకుంటే దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఎనిమిదేళ్లుగా నల్లగొండ జిల్లా రైతాంగానికి  ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.  కృష్ణానది నుంచి ఏపీ రోజుకు ఎనిమిది నుంచి 11 టీఎంసీల నీటిని తరలించుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు, పాలమూరు, రంగారెడ్డికి 40టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించాలని ఎంపీ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-29T10:13:28+05:30 IST