వాయిస్‌ దుర్వినియోగానికి అవకాశం ఉందా?

ABN , First Publish Date - 2020-09-26T06:04:08+05:30 IST

మనం మాట్లాడే అనేక మాటలు చిన్న చిన్న ఆడియో క్లిప్‌ల రూపంలో సంబంధిత సర్వీస్‌ల దగ్గర స్టోర్‌ అయి ఉంటాయి. దీంతో మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు...

వాయిస్‌ దుర్వినియోగానికి అవకాశం ఉందా?

  • గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్స లాంటి వాయిస్‌ అసిస్టెంట్స్‌ మన వాయిస్‌ డేటాని దుర్వినియోగం చేసే అవకాశం ఏమైనా ఉందా?
  • - ప్రదీప్‌


వాస్తవానికి స్మార్ట్‌ ఫోన్‌ లేదా స్మార్ట్‌ స్పీకర్‌ వాయిస్‌ రూపంలో మనమిచ్చే కమాండ్లను స్వీకరించి, వాటిని తమ దగ్గర ఉన్న డేటాబేస్‌తో సరిపోల్చి, మనకు కావలసిన ఫలితాన్ని అందించడం కోసం వాయిస్‌ అసిస్టెంట్‌ పని చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో మనం మాట్లాడే అనేక మాటలు చిన్న చిన్న ఆడియో క్లిప్‌ల రూపంలో సంబంధిత సర్వీస్‌ల దగ్గర స్టోర్‌ అయి ఉంటాయి. దీంతో మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, కొన్నిసార్లు అనుకోకుండా థర్డ్‌-పార్టీ సంస్థలు ఈ డేటాను యాక్సెస్‌ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు కొంత కాలం క్రితం గూగుల్‌ సంస్థ వినియోగదారుల వాయిస్‌ డేటాను విశ్లేషించడం కోసం ఓ థర్డ్‌-పార్టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి కొంతమంది వినియోగదారుల వాయిస్‌ డేటాను తస్కరించి పబ్లిక్‌గా పెట్టాడు. ఇలాంటి అరుదైన సందర్భాలు తప్పించి మన డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఏమీ లేదు. అయితే చాలా సంస్థలు ఇలాంటి వాయిస్‌ డేటాను మార్కెటింగ్‌ అవసరాల కోసం, వ్యాపార ప్రకటనలు చూపించడానికి ఉపయోగిస్తూ ఉంటాయి.

Updated Date - 2020-09-26T06:04:08+05:30 IST