Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇదెక్కడి న్యాయం ?

 తల్లి స్థలాన్ని ఆక్రమించి

 ఆమెపైనే కేసు

 పీఎస్‌ ఎదుట వృద్ధురాలి 

 కన్నీటి పర్యంతం

కనిగిరి, డిసెంబరు 1: కన్నకొడుకే స్థలాన్ని ఆక్రమించి రాజకీయ నాయకుల అండతో తమ్ముడు, వృద్ధురాలైన తల్లిపై కేసు పెట్టిన వైనం కనిగిరిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఎర్రఓబనపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. అందులో మూడో కుమారుడి వద్ద ఆ వృద్ధురాలు ఉంటోంది. పెద్ద కుమారుడికి వాటా కింద భర్త ఉన్నప్పుడే 20 సెంట్ల స్థలం పంచి ఇచ్చింది. అలాగే మిగతా కొడుకులకూ పంచి ఇచ్చింది. పెద్దకుమారుడు మినహా మిగతా వారు ఇంటిలోకి వెళ్లాలనే ఉద్దేశంతో  రోడ్డు నుంచి ఇంటి వరకు నడిచేందుకు 10 అడుగుల వెడల్పుతో జాగా వదిలారు.  ప్రస్తుతం పెద్ద కొడుకు దారి జాగాను  ఆక్రమించి తమ్ముళ్లు, తల్లిని ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. ఇదేమి న్యాయం అని కన్నతల్లి ప్రశ్నిస్తే ఆమె, మూడో కుమారుడిపై కేసు బనాయించారు. బుధవారం విచారణ పేరుతో వృద్ధురాలిని పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాపెద్ద కొడుకు మాటలు నమ్మి ఈ వయసులో నన్ను పోలీసులు విచారణ కోసం పిలిపించటం న్యాయమా అని వృద్ధురాలు పోలీ్‌సస్టేషన్‌ ఎదుట వాపోయింది.  పోలీసులు వాస్తవాలు గ్రహించి న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు వేడుకుంటోంది.

Advertisement
Advertisement