Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్యల పరిష్కారంలో ఇదేనా చిత్తశుద్ధి?

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌లో బహిరంగ సభలో అభివాదం చేస్తున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

మాతో పాదయాత్ర చేయండి సమస్యలు చూపిస్తా

అభివృద్ధి ఎంత చేశారో చూపించండి

సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాస్తా

సమస్య ఉంటే మీరు రాజీనామా చేయాలి

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలదేవరకొండ/చింతపల్లి: జిల్లా సమస్యల పరిష్కారంలో సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధి ఇదేనా అని వైఎస్‌ ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.  ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 12వ రోజు రంగారెడ్డి జిల్లాను దాటి నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌లోకి ఆమె ప్రవేశించారు. వైఎస్‌ షర్మిల పాదయాత్రకు వైఎస్‌ఆర్‌ టీపీ నాయకులతోపాటు ప్రజలు ఘన స్వాగతం పలికారు.


కేసీఆర్‌ నల్లగొండ జిల్లాకు ఏం చేశాడు. పోడు పట్టాలు పరిష్కరించేందుకు కేసీఆర్‌ వస్తానన్నాడు. అవసరమైతే ఇక్కడే కుర్చీ ఏసుకుని కూర్చుని పరిష్కరిస్తాన న్నాడు. పోడు పట్టాల విషయాన్ని కేసీఆర్‌ ఎందుకు పరిష్కరించలేదు. కుర్చీలు లేవని పరిష్కరించలేదా...? చిత్త శుద్ధి లేక పరిష్కరించలేదా.. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. మేము మొదలు పెట్టిన పాదయాత్రలో పాల్గొనండి సమస్యలు చూపిస్తాం.. అభివృద్ధి ఎంత చేశారో మీరు చూపించండి.. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాస్తా.. సమస్య ఉంటే మీరు రాజీనామా చేయాలి అని సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఎంతో మంది ఆత్మబలిదానంతో ఏర్పడిన బంగారు తెలంగాణను బార్ల తెలంగాణగా మార్చారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ల కాలంలో నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ మాత్రం, ఫాంహౌస్‌లో విలాసాలు అనుభవిస్తున్నారని విమ ర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ఆర్‌ నల్లగొండ జిల్లాకు 30సార్లు వచ్చారని, ఈ జిల్లా అంటే ఎంతో ప్రేమ ఉండేదన్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్‌ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చారు, ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో నెలకొన్న ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. 


కార్పొరేషన్ల మాటున అప్పులు

కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్‌ అప్పులు చేస్తున్నారని, ఆ అప్పులు తీర్చే మార్గం లేదని షర్మిల అన్నా రు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ర్టాన్ని కేసీఆర్‌ నాశనం చేశారని, ఇప్పటికే నాలుగులక్షల కోట్ల అప్పు మన రాష్ట్రం మీద ఉందన్నారు. ఆ వడ్డీ భారం కట్టే స్థోమత రాష్ర్టానికి లేదని, అలాంటిది మళ్లీ కార్పొ రేష న్లు ఏర్పాటు చేసి, మళ్లీ లోన్లు తీసుకోవడానికి రెడీ అవుతు న్నారన్నారు. ఇప్పుడు చేసిన అప్పులు తీర్చడానికే వంద సంవత్సరాలు పడుతుందని, ఇంకా అప్పు చేస్తే ఎలా తీర్చా లన్నారు. సీఎం కేసీఆర్‌ చేసిన అప్పులు తరతరాలు భరించాలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం రూ.లక్షా30వేల కోట్ల అప్పుచేశారన్నారు.  


మహిళలు, చిన్నారులకు కరువైన రక్షణ

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని షర్మిల అన్నారు. అకారణంగా ఆడబిడ్డలు బలైపోతున్నా, నడిరోడ్డుమీద లాయర్లను నరికి చంపినా పట్టించుకోరా అని ప్రశ్నించారు. వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే నే పేదలు, మహిళలకు న్యాయం జరుగుతుందని, నిస్వార్థం గా ప్రజలకు సేవచేయడానికే వైఎ్‌సఆర్‌ బిడ్డగా మీముందు కు వచ్చినట్లు తెలిపారు. ఉచిత విద్య, వైద్యం,పేదవారి సొం తింటి కల నెరవేర్చడం కోసం, అర్హుల పింఛన్‌కోసం వైఎ్‌సఆర్‌ పాలన తిరిగిరావడంకోసం, ప్రజలకోసం పుట్టిన పార్టీ వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అని అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, కాంగ్రెస్‌ టీఆర్‌ఎ్‌సతో కుమ్మకైందన్నారు. కార్య క్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, వి.రాజుగోపాల్‌, చంద్రహసన్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్‌, భరత్‌రెడ్డి, పర్వతం వేణు, కళ్యాణ్‌నాయక్‌, ఏపూరి సోమన్న, వేణుగోపాల్‌రెడ్డి, బెదరకోట భాస్కర్‌, సిద్దగోని నవీన్‌గౌడ్‌, వెంకటేష్‌, శ్రీనివాస్‌, గణేష్‌, సిరాజ్‌, జహంగీర్‌ పాల్గొన్నారు.  


ఫ్లోరైడ్‌ పరిష్కారానికి వైఎస్‌ఆర్‌ కృషి 

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి వైఎ్‌సఆర్‌ శ్రీశైలం సొరంగమార్గాన్ని ప్రారంభించారని, ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని షర్మిల విమర్శించారు. జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీతోపాటు ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి వైఎ్‌సఆర్‌ శ్రీశైలం సొరంగమార్గాన్ని ప్రారంభిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.2వేలకోట్లు కేటాయించలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నారన్నారు. డిండి, నక్కలగండి, ఉదయ సముద్రం వైఎ్‌సఆర్‌ బతికుంటే పూర్తయ్యేవన్నారు. వైఎ్‌సఆర్‌ ఎస్సీ, ఎస్టీలకు పోడు పట్టాలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. పేదవారి కోసం ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన ఘనత వైఎ్‌సఆర్‌కే దక్కిందని,అన్ని వర్గాల వారికి 46 లక్షలపక్కా ఇళ్లు నిర్మించారని, 11లక్షల ఉద్యోగాలు, మూడుసార్లు జాబ్‌ నోటిఫికేషన్‌లు ఇచ్చిన ఘనత వైఎ్‌సఆర్‌కే దక్కిందని తెలిపారు. 

Advertisement
Advertisement