Apr 21 2021 @ 16:19PM

సలార్‌లో శృతి హాసన్ రోల్ ఇదేనా..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుండటం అలాగే ప్రభాస్‌కి పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ ఉండటంతో ఈ సినిమా మీద ఊహించని విధంగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా తెచ్చుకోవడం మరో పెద్ద ప్లస్ పాయింట్ అయింది. 

సలార్ సినిమాలో ప్రభాస్‌కి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. మూడేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ శృతిహాసన్ టాలీవుడ్‌లో కనిపించలేదు. రీసెంట్‌గా మాస్ మహారాజ నటించిన క్రాక్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో  శృతిహాసన్ పోషించిన గెస్ట్ రోల్‌కి కూడా మంచి పేరు తెచ్చింది. ఈ క్రమంలో సలార్ సినిమాలో అవకాశం అందుకుంది. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఈ పాత్రని ఒక రియల్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్‌తో డిజైన్ చేశాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదే నిజమైతే శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో ఎంతవర్కు మెప్పిస్తుందో చూడాలి.