Jul 13 2021 @ 11:34AM

'కార్తికేయ' సీక్వెల్‌కి టైటిల్ ఇదేనా..?

సూపర్ హిట్ మూవీ 'కార్తికేయ' సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం 'కార్తికేయ 2' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సీక్వెల్‌ చిత్రీకరణ జరుగుతుండగా, తాజాగా దీనికి 'దైవం మనుష్య రూపేణా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్రం బృందం పరిశీలిస్తున్నట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇంతకముందు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్ర షూటింగ్ ఆగస్టు నుండి యూరప్, వియత్నాంలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఈ క్రమంలో టైటిల్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్న చిత్ర బృందం 'దైవం మనుష్య రూపేణా' అనే టైటిల్ ఫిక్స్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. తాజా వార్తలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.