తూతూ మంత్రమేనా?

ABN , First Publish Date - 2022-03-05T06:36:31+05:30 IST

చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోళ్లలో అవినీతిపై అధికారుల విచారణ తూతూ మంత్రంగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తూతూ మంత్రమేనా?
పీఏసీఎస్‌లో విచారణ నిర్వహిస్తున్న అధికారి

నేరేడుచర్ల, మార్చి 4: చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోళ్లలో అవినీతిపై అధికారుల విచారణ తూతూ మంత్రంగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ అధికారిగా సహకార సంఘం అధికారి రాజశ్రీని ఉన్నతాధికారులు నియమించారు. ఆమె వస్తున్నారని తెలిసిన సీఈవో సెలవుపై వెళ్లారు. సెలవుల అనంతరం సీఈవో వచ్చాక విచారణ ప్రారంభం కాగా, ఈ లోగా అన్నింటి నీ చక్కబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం విక్రయించినట్టు రికార్డుల్లో ఉన్న రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి విచారణ నిర్వహించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా వారి ని పీఏసీఎస్‌ కార్యాలయానికి రప్పించి విచారణ నిర్వహించిన అధికారి తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్‌ పరిధిలో లేని రైతులు ధాన్యం విక్రయించినట్టు రికార్డులు సృష్టించడంతోపాటు, అసలు ధాన్యం కొనుగోలు చేయకుండానే ట్రక్‌ షీట్లు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి.  అయితే అక్రమాలకు పాల్పడిన వారు తాను ధాన్యం విక్రయించినట్టు నర్సయ్యగూడెంకు చెందిన ఓ రైతుతో విచారణ అధికారి ఎదుట సాక్షం ఇప్పించారు. అదేవిధంగా నేరేడుచర్లకు చెందిన ఒక వ్యాపారీతో సాక్షం ఇప్పించారు. ఈ తంతు రెండు రోజులుగా కొనసాగుతుండగా, విచారణ అధికారి తీరుపై పీఏసీఎ్‌సకు చెందిన పలువురు డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన పెద్దల ఒత్తిడితోనే విచారణను పక్కదారిపట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

వీటిపై విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి

మేడారంలో గ్రామంలో ఐకేపీ కేంద్రం ఉన్నా, అక్కడి రైతులు చిల్లేపల్లిలో ఎందుకు విక్రయించారో విచారించాల్సి ఉంది. రెండెకరాల పొలం ఉన్నా 800 టిక్కీల ధాన్యం విక్రయించినట్టు చూపడంతోపాటు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పేరున ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపారు. నేరేడుచర్లలోని వ్యాపారుల వద్ద 1000 బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్టు ఉంది. అసలు దొడ్డు రకం సాగుచేయని రైతు లు ఆ రకం ధాన్యాన్ని ఎలా విక్రయించారనేది ప్రశ్నగా మారింది. నర్సయ్యగూడెంలో ఒక్క ఎకరంలో కూడా దొడ్డు రకాలు సాగుకాలేదు. వీటిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే పలు అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకా శం ఉంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు డైరెక్టర్లు కలెక్టర్‌ను కలిశారు. అయినా దీనిపై సరైన చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడికి తలొగ్గి చెప్పా..

ఒత్తిడికి తలొగ్గే ధాన్యం విక్రయించినట్టు విచారణ అధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు నర్సయ్యగూడెంకు చెందిన రైతు కంభం భగవంతరెడ్డి మాట్లాడినట్టు ఓ ఆడియో వైరల్‌ అయింది. దీంతో ‘ఆంధ్రజ్యోతి’ ఆయన్ను వివరణ కోరగా, ధాన్యం విక్రయించినట్టు చెప్పకుంటే ఇబ్బందులు పడ్తారని కొందరు హెచ్చరించడంతో విచారణ అధికారి ఎదుట అలాగే వాంగ్మూలం ఇచ్చానన్నారు. అకౌంట్లలో డబ్బులు పడ్తాయని చెబితే వాటిని డ్రా చేసి ఇచ్చామని, ఒక్క బస్తా ధాన్యం కూడా చిల్లేపల్లి పీఏసీఎ్‌సలో విక్రయించలేదని స్పష్టం చేశారు. పత్రికల్లో వార్తలను చూసి ఇదేంటని పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సను ప్రశ్నిస్తే నేనున్నా.. ఏం కాదంటూ, తాను చెప్పినట్టుగా విచారణ అధికారి ఎదుట వాంగ్మూలం ఇవ్వాలన్నాడన్నారు.

ధాన్యం అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ములుగు ఎమ్మెల్యే సీతక్క

సూర్యాపేటరూరల్‌: మంత్రి జగదీ్‌షరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ములు గు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని బాలెంల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్ర్పెడ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో స్కూల్‌ బ్యాగుల ను ఆమె శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ, ధాన్యం కొనుగోళ్ల రూ.100కోట్ల మేర అక్రమాలు జరిగితే తూతూ మంత్రంగా విచారణ నిర్వహించి దోషులను తప్పిస్తున్నారని ఆరోపించారు. యాసంగి లో ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామా ఆడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆమె వెంట టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి, సర్పంచ్‌ రామాసాని రమే్‌షనాయుడు, నాయకులు గట్టు శ్రీనివాస్‌, రమణారెడ్డి, షఫీఉల్లా, వెలుగు వెంకన్న, గోదల రంగారెడ్డి, ప్రభాకర్‌, యాదవరెడ్డి, స్వామినాయుడి, ఉన్నారు.

Updated Date - 2022-03-05T06:36:31+05:30 IST