Jun 12 2021 @ 18:45PM

వినాయక్ చేతిలో 'కర్ణన్' తెలుగు రీమేక్..?

టాలీవుడ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతికి తమిళ సూపర్‌ హిట్ 'కర్ణన్' తెలుగు రీమేక్ వచ్చినట్టు సమాచారం. ధనుష్ నటించిన ఈ సినిమా కోలీవుడ్‌లో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. దాంతో దీనిని తెలుగులో నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రైట్స్ దక్కించుకున్నారు. ఈ చిత్ర తెలుగు రీమేక్‌లో ఆయన తనయుడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీను నటించనున్నాడు. అయితే దీనిని తెరకెక్కించే దర్శకుడి విషయంలో పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు వినాయక్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది. 

బెల్లకొండ శ్రీనుని సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేసింది వినాయక్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఛత్రపతి' హిందీ రీమేక్ చేయనున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా కాస్త సమయం ఉండటంతో ఈలోపు 'కర్ణన్' రీమేక్ కోసం వినాయక్ - బెల్లంకొండ హీరో కలవనున్నట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ రానుందని తెలుస్తోంది.