పాక్‌లో మన దౌత్యాధికారిని వెంబడించిన ఐఎస్ఐ వర్గాలు

ABN , First Publish Date - 2020-06-05T13:52:53+05:30 IST

పాకిస్థాన్‌లో భారత దౌత్య అధికారి గౌరవ్‌ అహ్లువాలియాకు భయానకమైన అనుభవం ఎదురైంది.

పాక్‌లో మన దౌత్యాధికారిని వెంబడించిన ఐఎస్ఐ వర్గాలు

ఆయన కారును వెంబడించిన ఐఎస్ఐ వర్గాలు

న్యూఢిల్లీ, జూన్‌ 4: పాకిస్థాన్‌లో భారత దౌత్య అధికారి గౌరవ్‌ అహ్లువాలియాకు భయానకమైన అనుభవం ఎదురైంది. ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆయన్ను ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న కొందరు వ్యక్తులు వెంబడించి భయపెట్టేందుకు ప్రయత్నించారు. మన ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలను కాజేసేందుకు యత్నించిన పాక్‌ రాయబార కార్యాలయంలోని ఇద్దరు అధికారులను మన నిఘా వర్గాలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని, ఆ దేశానికి తిప్పి పంపిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. 

Updated Date - 2020-06-05T13:52:53+05:30 IST