ఆఫ్ఘన్‌లో భారత్ నిర్మించిన ఆస్తుల విధ్వంసానికి ఐఎస్ఐ ఆదేశాలు!

ABN , First Publish Date - 2021-07-18T22:51:01+05:30 IST

యుద్ధం వల్ల నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దేశం నిర్మించిన

ఆఫ్ఘన్‌లో భారత్ నిర్మించిన ఆస్తుల విధ్వంసానికి ఐఎస్ఐ ఆదేశాలు!

న్యూఢిల్లీ : యుద్ధం వల్ల నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దేశం నిర్మించిన వివిధ ప్రాజెక్టులను నాశనం చేయాలని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆదేశించింది. గడచిన రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణం కోసం భారత దేశం 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. భారత్ సహకారంతో నిర్మించిన వాటిలో ఆఫ్ఘన్ పార్లమెంటు భవనం చాలా ముఖ్యమైనది. 


ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంపై తాలిబన్లు దాడి చేస్తున్నారు. తాలిబన్లకు అండగా దాదాపు 10 వేల మంది పాకిస్థానీ ఉగ్రవాదులు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ ఐఎస్ఐ తాలిబన్, పాకిస్థాన్ ఉగ్రవాదులకు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. భారత దేశం సౌహార్దత కనిపించే గుర్తులను తొలగించాలని వీరిని ఆదేశించింది. భారత్ నిర్మించిన ఆస్తులు, ప్రాజెక్టులు, భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఆదేశించింది. 


భారత ప్రభుత్వం డెలారాం-జరంజ్ సల్మా డ్యామ్  మధ్య 218 కిలోమీటర్ల పొడవైన రోడ్డును, ఆఫ్ఘన్ పార్లమెంటు భవనాన్ని  నిర్మించింది. విద్యాభివృద్ధికి విశేషంగా సేవలందించింది. టీచర్లకు, బోధనేతర సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. 350 మిలియన్ డాలర్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఇటీవలే భారత ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో కాబూల్ నగరానికి తాగునీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టు కూడా ఉంది. 


Updated Date - 2021-07-18T22:51:01+05:30 IST