Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 16 2021 @ 10:49AM

ఆఫ్ఘన్ మసీదుపై దాడి మా పనే : ISIS

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో షియా ముస్లింల మసీదుపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడికి తమదే  బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ (ISIS) ప్రకటించింది. ఇద్దరు ISIS ఉగ్రవాదులు ఈ మసీదు వద్ద ఉన్న గార్డులను కాల్చి చంపారని, ఆ తర్వాత మసీదులోకి ప్రవేశించి, తమను తాము పేల్చుకున్నారని తెలిపింది. ఈ వివరాలను ISIS న్యూస్ ఏజెన్సీ శుక్రవారం పోస్ట్ చేసింది. 


ISIS ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు ఉగ్రవాదులు శుక్రవారం ప్రార్థనల సమయంలో కాందహార్‌లోని షియా ముస్లింల మసీదు వద్దనున్న గార్డులను చంపేసి, మసీదులోకి ప్రవేశించారు. అనంతరం ప్రార్థనలు చేస్తున్న రెండు బృందాల మధ్యకు వెళ్ళి తమను తాము పేల్చుకున్నారు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో వ్యక్తులు గాయపడ్డారు. 


ఇదిలావుండగా, ఈ మసీదు ఇమామ్ సర్దార్ మహమ్మద్ జైదీ మాట్లాడుతూ, మొత్తం నలుగురు ఉగ్రవాదులు వచ్చారని చెప్పారు. వీరిలో ఇద్దరు మసీదు వద్దనున్న గార్డులను చంపారని, మిగిలిన ఇద్దరూ మసీదులోకి చొరబడి, తమను తాము పేల్చుకున్నారని చెప్పారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసే సమయంలో ఈ దాడి జరిగిందన్నారు. 


Advertisement
Advertisement