బాలికలు స్కూళ్లకు వెళ్లాలో వద్దో నిర్ణయించేది వాళ్లే.. తాలిబన్ నేత కీలక వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-08-19T23:49:33+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో మహిళల పాత్ర, వారికున్న పరిమితులు ఏమిటనేది తమ ఇస్లామిక్ పండితుల మండలే నిర్ణయిస్తుందని తాలిబన్ల సీనియర్ నాయకుడొకరు తాజాగా పేర్కొన్నారు.

బాలికలు స్కూళ్లకు వెళ్లాలో వద్దో నిర్ణయించేది వాళ్లే.. తాలిబన్ నేత కీలక వ్యాఖ్య

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో మహిళల పాత్ర, వారికున్న పరిమితులు ఏమిటనేది తమ ఇస్లామిక్ పండితుల మండలే నిర్ణయిస్తుందని తాలిబన్ల సీనియర్ నాయకుడొకరు తాజాగా పేర్కొన్నారు. ‘‘మా దేశంలో బాలికలు స్కూళ్లకు వెళ్లాలా వద్దా అనే అంశాన్ని మా ఉలేమాలే(ఇస్లామిక్ పండితులు) నిర్ణయిస్తారు’’ అని వహీదుల్లా హషీమీ రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. ‘‘హిజాబ్, బుర్ఖా, లేదా పరదాకు తోడు అబాయ ధరించాలా.. అనే విషయాలను కూడా వారే నిర్ణయిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో మహిళల అణచివేత తప్పదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-19T23:49:33+05:30 IST