ఇక్కడ కనిపిస్తున్నది మనిషి కాదా... వైరల్ ఫోటో రహస్యమిదే!

ABN , First Publish Date - 2021-02-18T13:24:19+05:30 IST

ట్విట్టర్‌లో ఒక ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోకు సంబంధించిన...

ఇక్కడ కనిపిస్తున్నది మనిషి కాదా... వైరల్ ఫోటో రహస్యమిదే!

న్యూఢిల్లీ: ట్విట్టర్‌లో ఒక ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోకు సంబంధించిన రహస్యం తెలియగానే అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలో ఒక వ్యక్తి బెడ్‌పై పడుకొని ఉంటడాన్ని గమనించవచ్చు. అతనికి ఒకవైపున ఒక టేబుల్‌పై ఒక ల్యాంప్, ఫ్యామిలీ ఫొటో, కొన్ని ఔషధాలు కనిపిస్తాయి. మరోవైపు కేక్ పెడుతున్నట్లు ఒక వ్యక్తి చేయి కనిపిస్తుంది. 


మొదటిసారి చూసినపుడు ఈ ఫొటో సాధారణమైనదేనని, ఇందులో విశేషమేమీ లేదని అనిపిస్తుంది. అయితే ఈ ఫొటోను మరింత పరిశీలనగా చూస్తే అది మనిషి ఫొటో కాదని గమనించవచ్చు. అది ఒక ‘హైపర్ రియలిస్టిక్ కేక్’ అంటే ‘హ్యూమన్ కేక్’ అని అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఒక యూజర్ ఈ ఫొటోను షేర్ చేశారు. దానికింద క్యాప్షన్‌గా ‘ఇది ఒక కేకు’ అని రాశారు. అందరినీ ఇంతగా ఆశ్చర్యపరుస్తున్న ఈ ఫొటోకు ఇప్పటివరకూ కొన్ని వేల లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. కాగా ఈ కేకును ‘బ్రిటీష్ బేకర్ బెన్ కులెన్’ తయారు చేసింది. 

Updated Date - 2021-02-18T13:24:19+05:30 IST