కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి ISO గుర్తింపు

ABN , First Publish Date - 2021-08-31T01:30:44+05:30 IST

జిల్లాలోని ప్రఖ్యాత కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి "అంతర్జాతీయ ప్రమాణాల

కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి ISO గుర్తింపు

గుంటూరు: జిల్లాలోని ప్రఖ్యాత కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి "అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ(ISO)" గుర్తింపు లభించింది. ప్రముఖ శైవ క్షేత్రంగా  కోటప్పకొండ అలరారుతోంది. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, ధర్మకర్త కొండలరావు జమిందార్, ఈఓ రామకోటిరెడ్డిలకు గుర్తింపు పత్రాలు అందచేశారు. రాబోయే రోజుల్లో కోటప్పకొండ ప్రసాదాలు లడ్డు , అరిసెలకు కూడా అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఐఎస్ఓ గుర్తింపు రావడంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేసారు. కొండపై స్వామి వారికి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-08-31T01:30:44+05:30 IST