Abn logo
May 14 2021 @ 03:38AM

రాజ్‌భవన్‌లో ఐసోలేషన్‌ కేంద్రం

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి):  కరోనా బారినపడిన ఉద్యోగుల కోసం 10 పడకలతో రాజ్‌భవన్‌లో ఐసోలేషన్‌ కేంద్రాన్ని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ప్రారంభించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఆహారంతోపాటు మందులు, ఇతర వైద్యసేవలు అందిస్తారు. కాలనీ సంఘాలు ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్‌ సూచించారు. గవర్నర్‌ భర్త నెఫ్రాలజిస్ట్‌ సౌందరరాజన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధి విశాల్‌ ఆర్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement