ఎంజీయూలో ఐసోలేషన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2021-05-18T07:03:06+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎంజీయూ ప్రధాన క్యాంప్‌సలో అన్ని సౌకర్యాలతో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌వో కొండల్‌రావు తెలిపారు. అన్నెపర్తిలోని ఎంజీయూ ప్రధాన క్యాంప్‌సలో 150 పడకల ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.

ఎంజీయూలో ఐసోలేషన్‌ కేంద్రం
ఐసోలేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో కొండల్‌రావు

 డీఎంహెచ్‌వో కొండల్‌రావు

నల్లగొండ క్రైం, మే 17: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎంజీయూ ప్రధాన క్యాంప్‌సలో అన్ని సౌకర్యాలతో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌వో కొండల్‌రావు తెలిపారు. అన్నెపర్తిలోని ఎంజీయూ ప్రధాన క్యాంప్‌సలో 150 పడకల ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రోగులకు కావాల్సిన సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసోలేషన్‌ కేంద్రంలో ఉచితంగా భోజనంతో పాటు మందులు, స్నాక్స్‌, బలవర్ధక ఆహారం అందజేస్తామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యుల సలహాలు పాటిస్తూ మందులు వాడితే త్వరగా కోలుకోవచ్చన్నారు. ఎంజీయూ ఐసోలేషన్‌ కేంద్రంలో వైద్యులు, మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారి పర్యవేక్షణలో చికిత్స అందజేస్తామన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ఆయన వెంట హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం శశిధర్‌, స్వామి, వైద్య సిబ్బంది ఉన్నారు.


నేటి నుంచి హెల్ప్‌లైన్‌ సేవలు

నల్గొండ అర్బన్‌: కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌వో కొండల్‌రావు తెలిపారు. కరోనా బాధితుల ఆరోగ్య సమస్యలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు మంగళవారం ఈ హెల్ప్‌ లైన్‌ను ప్రారంభించనున్నారు. ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను, కరోనా బాధితుల సమస్యలకు వైద్యులు సలహాలిస్తారని, కొవిడ్‌ బారిన పడినవారు 9966921036, 9440718271, 9866863718 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. 24గంటలు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Updated Date - 2021-05-18T07:03:06+05:30 IST