Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమిక్రాన్ ఎఫెక్ట్: అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించే దిశగా ఇజ్రాయెల్

టెల్‌ అవీవ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పెను సంక్షోభంగా మారకమునుపే ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికులను దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. అయితే.. ప్రభుత్వం ఆమోదముద్ర పడగానే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి రావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే..సరిహద్దులను మూసేసేందుకు నిర్ణయించిన తొలి దేశంగా ఇజ్రాయెలే అవుతుంది. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆఫ్రికా ఖండంలో కళ్లు తెరిచిన ఒమిక్రాన్ క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఐరోపా ఖండంలోని పలు దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఆస్ట్రేలియాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు తాజాగా బయటపడ్డాయి. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement