గడ్డాలు పెంచే వాళ్లకు ప్రత్యేక మాస్కులు! మతాచారాలకు ఇబ్బంది రాకుండా..

ABN , First Publish Date - 2020-04-07T00:02:58+05:30 IST

కరోనా వైరస్ కట్టడికి సులువైన మార్గం ఏదైనా ఉందంటే అది మాస్కులు ధరించడం మాత్రమే. అయితే మత నిబంధనల కారణంగా అనేక మంది గడ్డం పెంచుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాస్కులు వీరికి అంత సౌకర్యాంగా ఉండవు. మరోవైపు.. గడ్డాన్ని తొలిగేంచేందుకు మనసోప్పదు. ఇటువంటి వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన మాస్కులు సిద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

గడ్డాలు పెంచే వాళ్లకు ప్రత్యేక మాస్కులు! మతాచారాలకు ఇబ్బంది రాకుండా..

జెరుసలేం: కరోనా వైరస్ కట్టడికి సులువైన మార్గం ఏదైనా ఉందంటే అది మాస్కులు ధరించడం మాత్రమే. అయితే మత నిబంధనల కారణంగా అనేక మంది గడ్డం పెంచుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాస్కులు వీరికి అంత సౌకర్యాంగా ఉండవు. మరోవైపు.. గడ్డాన్ని తొలిగేంచేందుకు మనసోప్పదు. ఇటువంటి వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన మాస్కులు సిద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ దేశంలో అధిక సంఖ్యలో ముస్లింలు, యూదులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు అవసరమొస్తే గడ్డం నిబంధనలు సడలింపును పరిశీలిస్తామని యూదుల మత పెద్దలు చెబుతున్నారు. దీంతో ఇజ్రాయెల్‌లో త్వరలో గడ్డం ఉన్న వాళ్లకు అనుకూలంగా ఉండేలా రకరకాల సైజుల్లో మాస్కులు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - 2020-04-07T00:02:58+05:30 IST