జీశాట్‌-1 ప్రయోగానికి ఇస్రో రెడీ

ABN , First Publish Date - 2021-03-08T08:23:57+05:30 IST

ఇటీవలే పీఎ్‌సఎల్వీ రాకెట్‌ ద్వారా 19 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి పంపి అద్భుత విజయాన్ని అందుకున్న ఇస్రో.. మరో ప్రయోగానికి రెడీ అవుతోంది.

జీశాట్‌-1 ప్రయోగానికి ఇస్రో రెడీ

శ్రీహరికోట (సూళ్లూరుపేట), బెంగళూరు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఇటీవలే పీఎ్‌సఎల్వీ రాకెట్‌ ద్వారా 19 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి పంపి అద్భుత విజయాన్ని అందుకున్న ఇస్రో.. మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. దేశ సరిహద్దులపై నిఘాపెట్టి, వాతావరణాన్ని పర్యవేక్షించేందుకు జియో ఇమేజింగ్‌ శాటిలైట్‌ (జీశాట్‌-1)ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్‌ స్పేస్‌సెంటర్‌ నుంచి ఈనెల 28న జీఎ్‌సఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యలయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాస్తవానికి జీఐశాట్‌-1ను గతేడాది మార్చి 5న నిర్వహించాల్సి ఉంది. కానీ.. లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు ప్రయోగానికి ముందు సాంకేతిక కారణాల వలన దీన్ని నిలిపివేశారు. జీశాట్‌-1 దేశ సరిహద్దులపై నిఘాపెట్టి.. అందుకు సంబంధించిన చిత్రాలను రియల్‌టైమ్‌లో భూమికి చేరవేస్తుంది. అలాగే వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రకృతి వైపరీత్యాల గురించి ముందే సమాచారం అందిస్తుంది.

Updated Date - 2021-03-08T08:23:57+05:30 IST