ఒకటినుంచి డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ: డీటీసీ

ABN , First Publish Date - 2021-06-22T06:34:00+05:30 IST

కరోనా రెండోదశ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసిన ఎల్‌ఎల్‌ఆర్‌ (లెర్నర్‌ లైసెన్స్‌ రిజిస్ర్టేషన్‌), డీఎల్‌ (డ్రైవింగ్‌ లైసెన్స్‌)ల జారీని జూలై ఒకటినుంచి పునఃప్రారంభిస్తున్నట్లు డీటీసీ బసిరెడ్డి చెప్పారు.

ఒకటినుంచి డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ: డీటీసీ
బసిరెడ్డి

చిత్తూరు సిటీ, జూన్‌ 21: కరోనా రెండోదశ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసిన ఎల్‌ఎల్‌ఆర్‌ (లెర్నర్‌ లైసెన్స్‌ రిజిస్ర్టేషన్‌), డీఎల్‌ (డ్రైవింగ్‌ లైసెన్స్‌)ల జారీని జూలై ఒకటినుంచి పునఃప్రారంభిస్తున్నట్లు డీటీసీ బసిరెడ్డి చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో మీడియా ద్వారా అభ్యర్థులకు పలు సూచనలిచ్చారు. మే, జూన్‌ నెలల్లో స్లాట్స్‌ పొందిన అభ్యర్థులు ్చఞట్ట్చఛిజ్టీజ్డ్ఛీుఽ.్ఛఞట్చజ్చ్టజిజీ.ౌటజ పోర్టల్‌ ద్వారా జూలై ఒకటో తేదీనుంచి సౌకర్యవంతమైన తేదీకి మార్చుకోవచ్చు. ఆర్టీఏ కార్యాలయాల్లో అయితే స్లాట్ల మార్పునకు ఎంవీఐలు సాయం చేస్తారు. కొవిడ్‌ కారణంగా ముగిసిన స్లాట్ల గడువును మాత్రం రెండు నెలలు ఆటోమేటిక్‌గా పొడిగించారు. బ్యాక్‌లాగ్‌ స్లాట్స్‌ అభ్యర్థులకు పరీక్షలు పూర్తయ్యాకే కొత్తవారు స్లాట్లను బుక్‌ చేసుకోవాలని డీటీసీ సూచించారు. 

Updated Date - 2021-06-22T06:34:00+05:30 IST