స్థానికులకే.. ‘సర్వ దర్శనం’

ABN , First Publish Date - 2021-09-08T00:02:20+05:30 IST

తిరుమల: తిరుమలలో బుధవారం నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది. అయితే ఈ టోకెన్లను కేవలం చిత్తూరు జిల్లా వాసులకే పరిమితం చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లను అధికారులు

స్థానికులకే.. ‘సర్వ దర్శనం’

తిరుమల: తిరుమలలో బుధవారం నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది. అయితే ఈ టోకెన్లను కేవలం చిత్తూరు జిల్లా వాసులకే పరిమితం చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లను అధికారులు ఏప్రిల్‌లో రద్దు చేశారు. అయితే దీనిపై  ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఐదు నెలల అనంతరం టోకెన్లను తిరిగి జారీ చేసేందుకు నిర్ణయించారు.  ఇందులో భాగంగా బుధవారం నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజూ రెండు వేల టోకెన్లను జారీ చేసేలా చర్యలు తీసుకున్నారు.


ఇప్పటికే స్వామి వారిని రోజూ సుమారు ఇరవై నంచి ఇరవై ఐదు వేల మంది దర్శించుకుంటున్న నేపథ్యంలో.. కేవలం పదిశాతం మందికి మాత్రమే అదనంగా సర్వదర్శనం టోకెన్లను అందించేలా చూస్తున్నారు. ఈ టోకెన్లకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ డిమాండ్ ఉంది. భక్తులు అత్యధికంగా వస్తే కరోనా వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చిత్తూరు వాసులకు మాత్రమే టోకెన్లను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత ఇతర జిల్లా వాసులకు టోకెన్లను ఇవ్వాలా.. వద్దా అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 



Updated Date - 2021-09-08T00:02:20+05:30 IST