డ్రోన్లపై కేంద్రం ముసాయిదా నిబంధనలు జారీ

ABN , First Publish Date - 2020-06-06T07:54:18+05:30 IST

దేశంలో డ్రోన్ల తయారీ, వాడకానికి సంబంధించి ముసాయిదా నిబంధనల్ని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం

డ్రోన్లపై కేంద్రం ముసాయిదా నిబంధనలు జారీ

న్యూఢిల్లీ, జూన్‌ 5: దేశంలో డ్రోన్ల తయారీ, వాడకానికి సంబంధించి ముసాయిదా నిబంధనల్ని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసింది. కరోనా కారణంగా నిర్మానుష్యమైన నగరాలు, పట్టణాల్లో నిఘా కు, వీడియోలు తీసేందుకు డ్రోన్ల వాడకం ఎక్కువైన నేపథ్యంలో ఈ ముసాయిదా నిబంధనల్ని జారీ చేయడం ఆసక్తికరం. వీటి ప్రకారం..

కేవలం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అనుమతులున్న వ్యక్తులు లేదా సంస్థలకు మాత్రమే అధీకృత ఉత్పత్తిదారులు డ్రోన్లను విక్రయించాలి. 

డ్రోన్ల దిగుమతిదారులు, ఉత్పత్తిదారులు, రవాణాదారులు, యజమానులు, వాటిని నియంత్రించేవారు కూడా డీజీసీఏ నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందే. అనుమతుల్లేకుండా డ్రోన్ల అమ్మకాలు నిషేధం

డ్రోన్లను ఉత్పత్తి చేసే పరిశ్రమల్ని, అనుమతులు వచ్చే లోపు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించేందుకు డీజీసీఏకు అధికారం ఉంటుంది. 

సరైన బీమా విధానం లేని ఏ సంస్థ కూడా భారత్‌లో తయారీ చేపట్టరాదు. డీజీసీఏ అనుమతి లేని ఏ బరువునూ డ్రోన్లు తీసుకెళ్లకూడదు. 250గ్రాముల కంటే తక్కువ  బరువుండే నానో క్లాస్‌ డ్రోన్లైతే భారత్‌లో వాడుకోవచ్చు. బరువైన డ్రోన్లయితే.. కేవలం అర్హత కలిగిన వ్యక్తి మాత్రమే దాన్ని ఆపరేట్‌ చేయాల్సి ఉంటుందని ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2020-06-06T07:54:18+05:30 IST