ఇసుకాసురులు

ABN , First Publish Date - 2021-03-08T06:27:41+05:30 IST

ఇసుక బంగారు రేణువుల్లా అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది. ప్రభుత్వ పథకాల అనుమతుల పేరిట ఇసుక అక్ర మంగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం పేక్షక పాత్ర వహిస్తోంది. నాయకుల కనుసన్నల్లో రేయింబ వళ్లూ ఇసుక జాతర జరుగుతోంది. ఈజీ మనీకి అలవాటుపడిన ఇసుకాసురులు అడ్డుచ్చిన వారిపై భౌతికదాడులకూ వెనుకాడడం లేదు. ఇసుక దందాను అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తూ ఇసుకాసురులకు తమ వంతు సాయం అంది స్తున్నారు.

ఇసుకాసురులు
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలేరు వాగు నుంచి ట్రాక్టర్లతో తరలుతున్న ఇసుక (ఫైల్‌ ఫొటో)

  పేరు పథకానిది.. చేరేది ప్రైవేటుకు 

  నాయకుల కనుసన్నల్లో రేయింబవళ్లు దందా

  చోద్యం చూస్తున్న అధికారులు, పోలీసులు 

 ఆందోళనలో ప్రజలు,  రైతులు

అనంతగిరి/తిరుమలగిరి, మార్చి 7: ఇసుక బంగారు రేణువుల్లా అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది. ప్రభుత్వ పథకాల అనుమతుల పేరిట ఇసుక అక్ర మంగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం పేక్షక పాత్ర వహిస్తోంది. నాయకుల కనుసన్నల్లో రేయింబ వళ్లూ ఇసుక జాతర జరుగుతోంది. ఈజీ మనీకి అలవాటుపడిన ఇసుకాసురులు అడ్డుచ్చిన వారిపై భౌతికదాడులకూ వెనుకాడడం లేదు. ఇసుక దందాను అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తూ ఇసుకాసురులకు తమ వంతు సాయం అంది స్తున్నారు. 

ఇసుక నియంతలు

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్తగూడెంలో  ఇసుక అక్రమ వ్యాపారం మూడు లారీలు, ఆరు ట్రాక్ట ర్లుగా సాగుతోంది.  తెల్లవారింది మొదలు రాత్రి పొద్దు పోయేవరకు పాలేరు వాగులోని ఇసుక మేటలను  తోడేస్తూ  అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కొత్తగూడెంలో గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. ఇసుక రవాణాకు గ్రామానికి చెందిన ట్రాక్టర్‌కు రూ.250లు, వేరే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌కు రూ.600లు వసూలు చేస్తూ నియంతలుగా వ్యవరిస్తున్నారు. గ్రామంలోనే పలువురు ఇసుక డంప్‌ లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్నా అడిగే నాథుడే లేకపోవడం అక్రమార్కులకు కలిసివస్తోంది. ఇష్టారీతిన ఇసుకను తోడేస్తుంటే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకు అక్రమ రవాణాను అడ్డుకుం టుం టే భౌతికదాడుతున్నారని, బెదరిస్తున్నారని గ్రామ స్థులు తెలిపారు. టార్గట్‌ కోసమే అధికారులు కేసులు పెట్టి మమ అనిపిస్తున్నారని పలువురు చెప్పారు. 

ప్రభుత్వ అనుమతుల పేరిట దందా

ప్రభుత్వ పథకాల అనుమతుల పేరిట  తిరుమల గిరి మునిసిపాలిటి పరిధిలోని అనంతారం బిక్కేరు వాగు నుంచి   అధికారుల కనుసన్నల్లో  రేయింబవ ళ్లూ వందల ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలి వెళుతోంది. ప్రజాప్రతినిధులు సొంత ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణాను యథేచ్చగా చేస్తున్నారు. దీంతో ఆ వైపు అధికారులు కన్నెత్తి చూడడానికి కూడా సాహ సించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పథకం ఏమిటి? ఆ నిర్మాణానికి ఎన్ని ట్రిప్పుల ఇసుక అవసరం?  అన్ని సమాచారం  లేకుండా అధికారులు నాలుగైరు నెలలుగా యథేచ్చగా అనుమతులు ఇస్తూ అక్రమార్కులకు తమ వంతు సహకారం అందిస్తున్నా  రనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమలగిరిలో ఇసుక అక్రమ రవాణాకు  సీసీ కెమెరాలు మూగ సాక్ష్యాలుగా మాత్రమే నిలిచాయి. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నా ఇసుకను ట్రాక్టర్లను పట్టుకున్న దాఖలాలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.

రేయింబవళ్లూ  ఇసుక తోడేస్తున్నారు 

బిక్కేరు వాగు నుంచి పగలూరాత్రి లేకుండా రోజూ వందల ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇక్కడి రైతులందరం ఏటి బోర్ల మీదే ఆధారపడ్డాం. ఇసుక తీయడంతో బోర్లన్నీ వట్టిపోయినయి.  ఇసుక అక్రమ రవాణా ఆపాలి.

చిలుక అశోక్‌, అనంతారం, తిరుమలగిరి మండలం


 కఠిన చర్యలు తీసుకుంటాం

పర్మిషన్‌ ఉంటేనే ఇసుకను తీసుకెళ్లాలి. రాత్రి పూట అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటివరకు దురాజ్‌పల్లి  జాతరలో సిబ్బందితో  బందోబస్తులో  ఉన్నాం. ఇక నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో పికెటింగ్‌ నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అరికడతాం.  

ఫడానియోల్‌ కుమార్‌, ఎస్‌ఐ, తిరుమలగిరి

రెండు ట్రాక్టర్లకే అనుమతి ఇచ్చాం

అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు కొత్తగూడెంలో ఒకటి, రెండు ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఇచ్చాం. ఇవి కాకుండా వేరే ట్రాక్టర్ల ద్వారా  ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటాం.

 వాజిద్‌అలీ, తహసీల్దార్‌, అన ంతగిరి

Updated Date - 2021-03-08T06:27:41+05:30 IST